
దేశంలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. కేసులు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపట్టారు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ ఇండియాలో కొనసాగుతోంది. అయితే, వ్యాక్సిన్ కోసం అనేకమంది భారతీయులు నేపాల్ బాటపడుతున్నారు. దీనికి కారణం లేకపోలేదు, అనేకమంది భారతీయులు చైనాతో వ్యాపార సంబంధాలు కలిగి ఉన్న సంగతి తెలిసిందే. చైనాలో ఉద్యోగాలు చేస్తున్నారు. అలానే చైనాలోని వివిధ విశ్వవిద్యాలయాలలో చదువుకునే స్టూడెంట్స్ కూడా ఉన్నారు . ఎవరైనా సరే చైనాలో అడుగుపెట్టాలి అంటే చైనా వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలని ఆ దేశం షరతు విధించింది. ఇండియాలో చైనా వ్యాక్సిన్ కు అనుమతి లేకపోవడంతో… అనేకమంది నేపాల్ వెళ్లి అక్కడ వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. వేలాది మంది భారతీయులకు చైనాలో వ్యాపారాలు ఉన్నాయి. దీంతో అక్కడి వెళ్ళాలి అంటే చైనా వ్యాక్సిన్ తీసుకోవడం తప్పనిసరి కావడంతో నేపాల్ లోని ఖాట్మండు వెళ్లి అక్కడ వ్యాక్సిన్ తీసుకుంటున్నారని అంతర్జాతీయ మీడియా పేర్కొన్నది.