NTV Telugu Site icon

Apple WWDC 2023: యాపిల్ బిగ్గెస్ట్ ఈవెంట్ నేడే!.. మార్కెట్లోకి రానున్న కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్, హార్డ్ వేర్ లాంచెస్

Apple

Apple

Apple WWDC 2023: యాపిల్ ప్రొడక్ట్స్ ఉపయోగించే వారికి బిగ్ న్యూస్. యాపిల్ అతిపెద్ద ఈవెంట్ WWDC 2023 నేడు (సోమవారం) ప్రారంభం కానుంది. యాపిల్ కంపెనీకి పలు ప్రొడక్ట్స్ రిలీజ్ కానున్నాయి. మీరు యాపిల్ ప్రొడక్ట్స్‌ను ఉపయోగిస్తున్నా, లేకపోతే యాపిల్‌కు సంబంధించి బోలెడంతా సమాచారం దీంట్లో లభిస్తాయి. కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్, హార్డ్ వేర్ లాంచెస్… ఇలా ఎన్నో ఈరోజు మార్కెట్లోకి రానున్నాయి.

Read Also: Sumalatha: సుమలత కొడుకు పెళ్లి.. మోహన్ బాబుదే సందడంతా

యాపిల్ అతిపెద్ద ఈవెంట్ వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (WWDC) గత మూడేళ్ల మాదిరిగానే జూన్ 5వ తేదీ నుండి జూన్ 9వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ ఈవెంట్ పూర్తిగా ఆన్‌లైన్‌లో జరుగుతుంది. కాలిఫోర్నియాలోని కుపెర్టినోలో ఉన్న యాపిల్ పార్క్‌లో ఈవెంట్ జరుగుతుంది. సోమవారం రాత్రి 10.30 గంటల నుంచి ఈవెంట్ ప్రారంభం కానుంది. అయితే డెవలపర్‌ల కోసం కొత్త టెక్నాలజీ, అప్‌డేట్‌ల గురించి సమాచారాన్ని అందించే ప్రధాన కార్యక్రమం భారత కాలమానం ప్రకారం అర్థరాత్రి రెండు గంటలకు జరగనుంది. ఆన్‌లైన్ ఈవెంట్‌ను యాపిల్ యూట్యూబ్ ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడవచ్చు. ఇది కాకుండా మీరు యాపిల్ అధికారిక వెబ్‌సైట్‌ను కూడా సందర్శించవచ్చు. ఈ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని Apple TV యాప్‌లో ‘Watch Now’ సెక్షన్‌లో కూడా వీక్షించవచ్చు. యాపిల్ కీనోట్ భారత కాలమానం ప్రకారం జూన్ 5వ తేదీన రాత్రి 10:30 గంటలకు ప్రత్యక్ష ప్రసారం అవుతుంది.

Read Also: Moongdal pakoda : పెసరపప్పుతో ఎప్పుడైనా పకోడీలను ట్రై చేశారా? ఒక్కసారి టేస్ట్ చేస్తే అస్సలు వదలరు సుమీ..

ఈ ఈవెంట్‌లో కంపెనీ ఐవోఎస్ 17, వాచ్ ఓఎస్ 10, మ్యాక్ ఓఎస్ 14లను లాంచ్ చేస్తుంది. వీటి కోసం ఒక కీనోట్ ఈవెంట్‌ను నిర్వహిస్తుంది. మరోవైపు iOS, iPadOS, macOS, watchOS, tvOS కొత్త వెర్షన్‌లను పరిచయం చేయడానికి యాపిల్ సిద్ధంగా ఉంది. ఇది కాకుండా ఈ ఈవెంట్‌లో ఏఆర్/ వీఆర్ మిక్స్‌డ్ రియాలిటీ హెడ్‌సెట్ కూడా లాంచ్ అవుతుంది. వీటితో పాటు 15 అంగుళాల మ్యాక్‌బుక్ ఎయిర్ మార్కెట్లో ఎంట్రీ ఇవ్వనుంది. ఏఆర్, వీఆర్ టెక్నాలజీ రెండిటినీ సపోర్ట్ చేస్తూ కొత్త ఎక్స్ఆర్ఓఎస్ ఆపరేటింగ్ సిస్టంపై పని చేసే ఈ హెడ్ సెట్ ధర 3,000 డాలర్ల (మనదేశ కరెన్సీలో రూ.2.47 లక్షలు) రేంజ్‌లో ఉండవచ్చని తెలుస్తోంది. వీటిలో 5000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను సపోర్ట్ చేసే మైక్రో ఓఎల్ఈడీ డిస్‌ప్లేలు అందించనున్నట్లు తెలుస్తోంది.