NTV Telugu Site icon

Sri Lanka President: నేడు శ్రీలంక అధ్యక్షుడిగా అనురా దిసనాయకే ప్రమాణ స్వీకారం

Asura

Asura

Sri Lanka President: శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో మార్క్సిస్టు( లెఫ్ట్ పార్టీ) నేత అనుర కుమార దిసానాయకే గెలిచారు. రెండో రౌండ్ ఓట్ల లెక్కింపు తర్వాత అనుర కుమార దిసనాయకేను విజేతగా ఎన్నికల సంఘం ప్రకటించింది. తాజా సమాచారం ప్రకారం అనూర కుమార దిసానాయకే ఈరోజు (సోమవారం) శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. దీంతో ఆయన శ్రీలంకకు తొమ్మిదవ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. మార్క్సిస్ట్ జనతా విముక్తి పెరమున పార్టీకి చెందిన నేషనల్ పీపుల్స్ పవర్ నేత, 56 ఏళ్ల అనుర కుమార తన సమీప ప్రత్యర్థి అయినా సమిత్ జన బలవేగయ పార్టీకి చెందిన సాజిత్ ప్రేమదాసపై విజయం సాధించారు.

Read Also: Fennel Seeds: ఇందుకే కాబోలు భోజనం తర్వాత సోంపు గింజలను తినేది.!

కాగా, ప్రస్తుత అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే స్వతంత్ర అభ్యర్థిగా ఈ ఎన్నికల్లో పోటీలో నిలిచారు. కానీ ఆయన కౌంటింగ్‌ జరిగిన తొలి రౌండ్‌లోనే పోటీలో నుంచి నిష్క్రమించిపోయారు. సుమారు రెండేళ్ల క్రితం శ్రీలంకలో జరిగిన తిరుగుబాటు తర్వాత పార్లమెంటు ద్వారా రణిల్ విక్రమసింఘేను అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. రణిల్ విక్రమసింఘే గత రెండేళ్లుగా ఆర్థిక సంస్కరణలపై ఒత్తిడి తెచ్చి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీలో నిలిచినా.. తొలి రౌండ్ ఓట్ల లెక్కింపులో ఎక్కువ సేపు నిలవలేకపోయారు. ఎన్నికల ఫలితాల తర్వాత రణిల్ విక్రమసింఘే శ్రీలంక అధ్యక్ష పదవీకి రాజీనామా చేశారు. దీంతో ఈరోజు అనుర కుమార దిసానాయకే ప్రెసిడెంట్ గా బాధ్యతలను స్వీకరించబోతున్నారు.