NTV Telugu Site icon

Anti Hijab Protest In Iran: హిజాబ్ తీసేసి నిరసనల్లో పాల్గొన్న స్కూల్ విద్యార్థినులు..

Iran

Iran

Anti Hijab Protest In Iran: ఇరాన్ దేశంలో హిజాబ్ వ్యతిరేక నిరసనలు రోజురోజుకు తీవ్రం అవుతున్నాయి. నాలుగు వారాలుగా అక్కడి యువత, మహిళలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. 22 ఏళ్ల మహ్సా అమిని అనే యువతిని హిజాబ్ ధరించలేదని అక్కడి మోరాలిటీ పోలీసులు అరెస్ట్ చేసిన కొద్ది రోజులకే ఆమె మరణించింది. దీంతో అప్పటి నుంచి అక్కడి మహిళలు తీవ్ర ఆందోళనలు చేస్తున్నారు. మహిళలు హిజాబ్ తీసేసి, జట్టు కత్తిరించుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ గళాన్ని విప్పుతున్నారు.

తాజాగా ఇరాన్ వ్యాప్తంగా పాఠశాల విద్యార్థినులు కూడా హిజాబ్ తీసేసి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఇరాన్ లో రోజురోజుకు స్వేచ్ఛ కోసం డిమాండ్లు పెరుగుతున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీకి వ్యతిరేకంగా ‘‘నియంతకు మరణం’’ అనే నినాదంతో యువత ఆందోళనలు చేపట్టింది. పలు స్కూళ్లలో విద్యార్థినులు తమ హిజాబ్ తీసేసి తీవ్రస్థాయిలో నినాదాలు చేస్తుండటం గమనించవచ్చు. స్త్రీ, స్వేచ్ఛ, జీవితం అని పాటలు పాడుతూ మహిళలు నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

Read Also: Doctor Donates her Entire Property: వైద్యురాలి ఔదార్యం.. ఆస్పత్రికి రూ.20 కోట్ల ఆస్తి విరాళం..

ఇరాన్ హ్యూమన్ రైట్స్ ప్రకారం..ఇరాన్ నిరసనల్లో ఇప్పటి వరకు 92 మంది నిరసనకారులు మరణించారు. ప్రభుత్వం కూడా నిరసనలను అణచివేయడానికి ప్రయత్నిస్తోంది. ఇప్పటికే అక్కడి ఇంటర్నెట్ పై తీవ్ర ఆంక్షలు పెట్టింది. సోషల్ మీడియాపై నిఘా పెంచింది. ఇటీవల జట్టు ముడిచి నిరసనల్లోకి వెళ్లిన ఓ యువతని ఇరాన్ బలగాలు కాల్చిచంపాయి. తాజాగా మరో 17 ఏళ్ల యువతి నికా షకరమిని కూడా ఆందోళల్లో మరణించింది. ఈమె మరణం వల్ల అక్కడి మహిళల్లో, యువతలో మరింత ఆగ్రహావేశాలు పెల్లుబికాయి.

ఇదిలా ఉంటే ఇజ్రాయిల్, అమెరికాలు తమ దేశంలో శాంతికి విఘాతం కలిగిస్తున్నాయని.. ఈ రెండు దేశాల వల్లే ఇరాన్ లో నిరసనలు వెల్లవెత్తుతున్నాయని ఇరాన్ సుప్రీం లీడర ఖమేనీ ఆరోపించారు. ఇస్లామిక్ రిపబ్లిక్ అయిన ఇరాన్ లో ఇస్లాం రివల్యూషన్ తరువాత అతిపెద్ద ఉద్యమం జరుగుతోంది. మరోవైపు ఉద్యమాన్ని బలవంతంగా అణచివేసేందుకు ప్రయత్నం ప్రయత్నిస్తోంది.

Show comments