NTV Telugu Site icon

Anited Airlines: అమెరికాలో మరో విమాన ప్రమాదం.. టేకాఫ్ అవుతుండగా మంటలు

United

United

అగ్రరాజ్యం అమెరికాలో వరుస విమాన ప్రమాదాలు ప్రయాణికులను హడలెత్తిస్తున్నాయి. గత వారం రెండుసార్లు విమాన ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. వాషింగ్టన్ డీసీలో హెలికాఫ్టర్ విమానాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులంతా మరణించారు. ఆ తర్వాత మరో చిన్న విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కూలిపోయింది. ఈ ఘటనల నుంచి తేరుకోక ముందే మరో ప్రమాదం చోటు చేసుకుంది. యునైటెడ్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం ప్రమాదానికి గురైంది. రన్ వేపై టేకాఫ్ అవుతుండగా మంటల్లో చిక్కుకుంది. కానీ, అదృష్టావశాత్తు పెనుముప్పు తప్పింది.

హ్యూస్టన్ నుంచి న్యూయార్క్ వెళ్లే యునైటెడ్ ఎయిర్ లైన్స్ ఫ్లైట్ టేకాఫ్ అవుతుండగా సడన్ గా వింగ్స్ నుంచి మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది. ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేయగా ఇన్ ఫ్లేటబుల్ స్లైడ్లు ఓపెన్ అయ్యాయి. దీంతో ప్రయాణికులను సురక్షితంగా దించేశారు. ప్రమాద సమయంలో సిబ్బందితో కలిపి 100 మందికి పైగా ప్రయాణికులుఉన్నట్లు సమాచారం.

ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం చోటుచేసుకోకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ విచారణ ప్రారంభించింది. ఇంజిన్ లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతోనే మంటలు అంటుకున్నాయని అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది.