NTV Telugu Site icon

Myanmar Earthquake: మయన్మార్‌లో మరోసారి భూకంపం.. 4.7గా తీవ్రత నమోదు..

Earthquake

Earthquake

Myanmar Earthquake: భారీ భూకంపంతో మయన్మార్, థాయ్‌లాండ్‌లో భీతావహ పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే మృతుల సంఖ్య 1000ని దాటింది. భవనాల శిథిలాల కింద చాలా మంది ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే, శనివారం మధ్యాహ్నం మరోసారి మయన్మార్‌ని భూకంపం వణించింది. 4.7 మాగ్నిట్యూడ్‌తో భూకంపం వచ్చింది. భూకంప లోతు 10 కి.మీగా ఉంది. దీనికి ముందు శనివారం మధ్యాహ్నం 3.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. శనివారం ఉదయం నుంచి ప్రకంపనలు వస్తూనే ఉన్నాయి.

Read Also: Film Journalists: ఫిలిం జర్నలిస్టు సంఘాలతో ఫిలిం ఛాంబర్ కీలక సమావేశం

శుక్రవారం రోజు 7.7, 6.7 తీవ్రతతో వచ్చిన భూకంపాలు వల్ల భారీ నష్టం ఏర్పడింది. మయన్మార్ జుంటా ప్రభుత్వం అంతర్జాతీయ సాయాన్ని కోరింది. మయన్మార్, థాయ్‌లాండ్ దేశాల్లో విపరీతమైన నష్టం ఏర్పడింది. భూకంప తీవ్రత సమీప దేశాలైన భారత్, కంబోడియా, చైనా, లావోస్‌లో కూడా కనిపించింది. భారత్ దెబ్బతిన్న మయన్మార్ కోసం 15 టన్నుల రిలీఫ్ మెటీరియల్‌ని పంపింది. ఇందులో టెంట్స్, బ్లాంకెట్స్, వాటర్ ప్యూరిఫైయర్స్, మెడిసిన్స్ ఉన్నాయి. హిండన్ ఎయిర్ బేస్ నుంచి ఇండియన్ ఆర్మీకి చెందిన విమానం ఈ సమాగ్రిని తీసుకెళ్లింది.

మయన్మార్‌లో భూకంపాలు ఎక్కువగా వచ్చే ప్రాంతాల జాబితాలో ఉంది. ఈ ప్రాంతంలో సాగైంగ్ ఫాల్ట్ లైన్ కారణం భూకంపాలు వస్తున్నాయి. ఇండియన్ టెక్టానిక్ ప్లేట్, బర్మా మైక్రోప్లేట్ రాపిడి కారణంగా అపారమైన శక్తి భూకంపంగా విడుదలవుతోంది. ఈ ఫాల్ట్ లైన్ చివర థాయ్‌లాండ్ వరకు ఉండటంతో తాజా భూకంపం వల్ల మయన్మార్‌తో పాటు ఆ దేశము కూడా ప్రభావితమైంది.