NTV Telugu Site icon

Hamas: గాజాపై దాడి కారణంగానే ఆమ్‌స్టర్‌డామ్‌లో ఇజ్రాయెలీలపై దాడి

Hamas

Hamas

గాజాపై ఇజ్రాయెల్ జరిపిస్తున్న మారణహోమానికి ప్రతీకారంగానే అమ్‌స్టర్‌డామ్‌లో ఇజ్రాయెల్ పౌరులపై దాడి జరిగిందని హమాస్ మిలిటెంట్ గ్రూప్ నేత సమీ అబు జుహ్రీ పేర్కొన్నాడు. గాజాలో సామూహిక హత్యలు కారణంగానే పాలస్తీనా అనుకూల గుంపులు.. ఇజ్రాయెల్ సాకర్ అభిమానులపై దాడికి దారి తీసిందని చెప్పుకొచ్చాడు. మానవ హక్కులను గౌరవించడం, అలాగే ప్రాంతీయ, ప్రపంచ భద్రత, శాంతి కోసం గాజాలో మారణహోమం ఆపేయడం అవసరం అని జుహ్రీ స్పష్టం చేశాడు.

గురువారం నెదర్లాండ్‌లో పాలస్తీనీయులు రెచ్చిపోయారు. ఇజ్రాయెల్‌ పౌరులపై ఇష్టానురీతిగా దాడులకు తెగబడ్డారు. ఫుట్‌బాల్ మ్యాచ్ చూసేందుకు వెళ్లిన ఇజ్రాయెల్ పౌరులపై ఒక గుంపు మూక దాడికి పాల్పడింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దాడికి సంబంధించి అమెరికాలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం తెలిపింది. మక్కాబి టెల్ అవీవ్ అభిమానులు స్టేడియం నుంచి బయటకు వెళ్తుండగా ఈ దాడి జరిగినట్లుగా వెల్లడించింది.

నెదర్లాండ్ రాజధాని ఆమ్‌స్టర్‌డామ్‌లో గురువారం రాత్రి మక్కాబి టెల్ అవీవ్ వర్సెస్ అజాక్స్ ఆమ్‌స్టర్‌డామ్ మధ్య యూరోపా లీగ్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ చూసేందుకు పెద్ద ఎత్తున ఇజ్రాయెల్ అభిమానులు నెదర్లాండ్స్‌కు వెళ్లారు. అయితే ఇదే అదునుగా పాలస్తీనా గుంపు రెచ్చిపోయింది. ఇజ్రాయెలీ సాకర్ అభిమానులుపై భౌతికదాడులకు పాల్పడ్డారు. దొరికినవాళ్లను దొరికినట్లుగానే చితకకొట్టారు. పిడిగుద్దులు గుద్దడం, కాళ్లతో తన్నడం.. ఇలా ఇష్టానురీతిగా దాడులకు తెగబడ్డారు. దాడి చేయొద్దంటూ వేడుకున్నా.. కనికరించకుండా కొడుతూనే ఉన్నారు. డబ్బులు, పాస్‌పోర్టులు కూడా వారి దగ్గర నుంచి లాగేసుకున్నారు. దాడి చేసినవాళ్లు అరబిక్‌లో పాలస్తీనా నినాదాలు చేస్తూ చెలరేగిపోయారు.

ఈ ఘటనపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తీవ్రంగా స్పందించారు. ఇజ్రాయెల్ ఫుట్‌బాల్ అభిమానులను రప్పించేందుకు రెండు విమానాలను ఆమ్‌స్టర్‌డామ్‌కు పంపాలని అధికారులకు ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆదేశించారు. అలాగే ఇజ్రాయెల్ పౌరులకు రక్షణ కల్పించాలని డచ్ అధికారులను కోరారు. పాలస్తీనీయుల దాడిలో దాదాపు 10 మంది ఇజ్రాయెలీయులు గాయపడినట్లుగా తెలుస్తోంది. ఇద్దరి వ్యక్తుల ఆచూకీ మాత్రం ఇప్పటి వరకు తెలియలేదు. దాడికి పాల్పడ్డవారు కొంత మందిని టార్గెట్ చేసుకుని.. పాస్‌పోర్టులు దొంగిలించనట్లుగా తెలుస్తోంది. తాజాగా హమాస్ స్పందిస్తూ…గాజాపై మారణహోమానికి ప్రతీకారంగా జరిగినట్లుగా వెల్లడించాడు.

Show comments