ఆఫ్ఘన్‌లో పరిస్థితిలు చాలా వేగంగా మారిపోయాయి.. ఎవ్వరూ ఊహించని తరహాలో తాలిబన్లు ఆఫ్ఘన్‌పై పట్టు సాధిస్తూ తక్కువ సమయంలో ఆ దేశాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. దీంతో.. ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ.. ఆఫ్ఘన్‌ను విడిచి పరారయ్యాడు.. ఖరీదైన కార్లతో పాటు.. పెద్ద ఎత్తున క్యాష్‌ను తన వెంట తీసుకొని వెళ్లాడని ప్రచారం జరిగింది.. అయితే, ఇప్పుడు తానే ఆపద్ధర్మ అధ్యక్షుడిని అంటూ తెరపైకి వచ్చారు ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్.. అధ్యక్షుడు దేశాన్ని విడిచి వెళ్లిపోవడంతో ఆపద్ధర్మ అధ్యక్షుడిని తానేనంటూ ప్రకటించుకున్నాడు.. ఆప్ఘనిస్థాన్ రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడు దేశం విడిచి వెళ్లిన సమయాల్లో ఉపాధ్యక్షుడు.. అధ్యక్ష బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంటుంది.. కాబట్టి తాను అధ్యక్ష బాధ్యతలను చేపట్టనున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించుకున్నాడు. అంతేకాదు.. తాను దేశంలోనే ఉన్నా.. త్వరలో వివిధ రాజకీయ పార్టీల నేతల మద్దతు కూడగట్టేందుకు వారందరిని కలుస్తానంటూ ట్వీట్ చేశాడు అమ్రుల్లా సలేహ్..
తానే ఆఫ్ఘన్ ఆపద్ధర్మ అధ్యక్షుడిని..
Amrullah Saleh