American CEO spends 2 million dollars each year to look 18 year old: ప్రకృతి ధర్మం ప్రకారం.. వయసు పెరిగేకొద్దీ మన శరీరంలో చాలా మార్పులు జరుగుతుంటాయి. అవయవాల పనితీరులో మార్పు వస్తుంది. వృద్ధాప్య ఛాయలు మెల్లమెల్లగా కనిపిస్తాయి. క్రమంగా శక్తి కూడా తగ్గుతూ వస్తుంది. ఒక దశలో వృద్ధాప్యం వచ్చేస్తుంది. అయితే.. ఓ వ్యక్తి మాత్రం ముసలివాడు కాకూడదనుకున్నాడు. ప్రకృతికి విరుద్ధంగా.. తిరిగి యువకుడిలా మారాలని నిర్ణయించుకున్నాడు. ప్రస్తుతం అతనికి 45 ఏళ్లు కాగా.. తన వయస్సుని 18 ఏళ్లకు తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఆల్రెడీ ఇందుకు సంబంధించిన చికిత్స తీసుకుంటున్నాడు.
Delhi Mayor Election: ఢిల్లీ మేయర్ ఎన్నికలు.. పెద్ద ట్విస్ట్ ఇచ్చిన ఆప్
ఆ వ్యక్తి పేరు బ్రియాన్ జాన్సన్. కాలిఫోర్నియాకు చెందిన ఇతను ఒక వ్యాపారవేత్త. శరీరంలో కొన్ని మార్పులు చేస్తే.. వయస్సు ప్రభావం కనిపించకుండా దీర్ఘాయువు పొందవచ్చని బ్రియాన్ ఎక్కడో చదివాడు. ఇంకేముంది.. వెంటనే వైద్యులను సంప్రదించాడు. 18 ఏళ్ల వయసులో తాను ఎలా కనిపించేవాడో, తిరిగి ఆ రూపం తెప్పించుకోవడం సాధ్యమేనా? అని అడిగాడు. అది సాధ్యమేనని, కాకపోతే ఈ ప్రత్యేక చికిత్సకు ఏడాదికి 2 మిలియన్ డాలర్లు ఖర్చు వెచ్చించాల్సి ఉంటుందని వాళ్లు పేర్కొన్నారు. వృద్ధాప్య ఛాయలు దరిచేరకుండా నిత్యం యువకుడిలా కనిపించేలా చికిత్స చేస్తామని హామీ ఇచ్చింది. తన వద్ద చాలా డబ్బులు ఉండటంతో.. అతడు సై అనేశాడు. ఇక అప్పటినుంచి వైద్యులు అతనికి చికిత్స అందించడం ప్రారంభించారు. ప్రస్తుతం ఆలివర్ జోల్మాన్ నేతృత్వంలోని వైద్యుల బృందం జాన్సన్‌కు చికిత్స అందిస్తోంది.
Google: భార్యాభర్తలకు షాకిచ్చిన గూగుల్.. ఒకేసారి ఇద్దరికి లేఆఫ్
చికిత్స తర్వాత తన శరీర దారుఢ్యం, ఊపిరితిత్తుల సామర్థ్యం 18 ఏళ్ల యువకుడిలా కనిపిస్తున్నాయని.. గుండె పని తీరు 37 ఏళ్ల వ్యక్తిలా, చర్మం నిగారింపు 28 ఏళ్ల వ్యక్తిలా తయారయ్యానని జాన్సన్ తెలిపాడు. ఈ ఏడాది కూడా 2 మిలియన్ డాలర్లు వెచ్చించి.. తన మెదడు, గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు, దంతాలు, మొదలైన అవయవాలు 18 ఏళ్ల యువకుడిలా మారేంత వరకు చికిత్స కొనసాగిస్తానని అతడు పేర్కొంటున్నాడు. కాగా.. జాన్సన్ శరీరభాగాల పనితీరును తెలుసుకునేందుకు నిత్యం 30 మంది వైద్యుల బృందం పర్యవేక్షిస్తోంది. ఈ చికిత్స కోసం జాన్సన్ తన ఇంట్లోనే భారీ ఖర్చుతో ఒక ల్యాబ్‌ను సిద్ధం చేసుకున్నాడు.
Siddharth: హీరోయిన్ తో ఎఫైర్ బట్టబయలే.. కానీ, పెళ్ళికి ముందే మరీ ఇంతలానా