Site icon NTV Telugu

US: గాల్లో ఉండగా విమానంలో మంటలు.. సేఫ్‌గా ల్యాండింగ్.. వీడియో వైరల్

Us

Us

అగ్ర రాజ్యం అమెరికాలో ఘోర విమానం ప్రమాదం తప్పింది. అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఇంజన్‌లో మంటలు చెలరేగాయి. పొగలు, నిప్పురవ్వులు రావడంతో పైలట్ అప్రమత్తమై లాస్ వెగాస్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేశాడు. క్షేమంగా అందరూ కిందకు దిగేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఇది కూడా చదవండి: Ritika Singh : కూల్ వెదర్ లో హాట్ ఫొటోస్ తో వేడి సెగలు పుట్టిస్తోన్న రితికా

ఎయిర్‌బస్‌కు చెందిన A321 విమానం హ్యారీ రీడ్ అంత్జాతీయ విమానాశ్రయం నుంచి షార్లెట్ డగ్లస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్తోంది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఇంజన్‌లో మంటలు చేలరేగాయి. వెంటనే పైలట్ అప్రమత్తమై లాస్ వెగాస్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశాడు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఎయిర్‌లైన్స్ తెలిపింది. అయితే ఇంజన్‌లో మంటలు చెలరేగినట్లు ఎలాంటి ఆధారాలు లేవని ఎయిర్‌లైన్స్ పేర్కొంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం పొగలు, నిప్పురవ్వలు రావడం కనిపించాయని తెలిపారు.

ఇది కూడా చదవండి: YS Jagan: నేడు వైఎస్ జగన్ క్వాష్ పిటిషన్‌పై విచారణ!

అయితే విమానం నుంచి శబ్దాలు రావడం చూశామని స్థానిక సాక్షులు పేర్కొన్నారు. పెద్ద శబ్దం వచ్చిందని.. తామంతా బయపడినట్లు వెల్లడించారు. ఇక విమానంలో 153 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. ఇక ప్రయాణికులను మరొక విమానంలో గమ్యస్థానాలకు తరలించారు.

ఇదిలా ఉంటే జూన్ 12న అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. టేకాఫ్ అయిన కొన్ని సెకన్లలోనే ఎయిరిండియా విమానం హాస్టల్‌పై కూలిపోయింది. ఒక్కరు మినహా 241 మంది చనిపోయారు. ఇక హాస్టల్‌లో 35 మంది మెడికోలు దుర్మరణం చెందారు. ఇక ఈ ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా చనిపోయారు.

 

Exit mobile version