America Germany Ready To Give Their War Tanks To Ukraine: ఉక్రెయిన్‌కి యుద్ధ ట్యాంకులు ఇవ్వాలా? వద్దా? అనే విషయంపై నాటోలో ఏర్పడిన అభిప్రాయబేధాలు ఇప్పుడు పూర్తిగా సమసిపోయాయి. రష్యాతో ధీటుగా పోరాడేందుకు గాను.. అమెరికాతో పాటు జర్మనీ సైతం తమ అత్యాధునిక ట్యాంకులను ఉక్రెయిన్‌కి ఇచ్చేందుకు అంగీకారం తెలిపాయి. అమెరికా వినియోగించే అత్యాధునిక ఎం1 అబ్రామ్స్‌తో పాటు మొత్తం 30 ట్యాంకులను ఉక్రెయిన్‌కి అందించాలని జో బైడెన్ సర్కార్ నిర్ణయించింది. అటు.. 14 ‘లెపర్డ్-2’ ట్యాంకులను అందించేందుకు జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్ ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. దీంతో.. ఉక్రెయిన్ అధికారులు సంతోషం వ్యక్తం చేశారు. రష్యా స్వాధీనం చేసుకున్న భూభాగాలను తిరిగి పొందడానికి ఈ ట్యాంకులు తమకెంతో సహాయపడతాయని పేర్కొన్నారు. అయితే.. అమెరికాలోని రష్యా రాయబారి మాత్రం దీనిపై మండిపడ్డారు. ఇది మరో కవ్వింపు చర్య అంటూ ఫైర్ అయ్యారు.
Revanth Reddy : మీ తొమ్మిదేళ్ల పాలనలో తెలంగాణకు ఒరిగింది శూన్యం
అంతకుముందు ఏం జరిగిందంటే.. ఉక్రెయిన్‌కి సహాయంగా యుద్ధ ట్యాంకులు పంపాలని అమెరికా, జర్మనీలపై ఒత్తిడి వచ్చింది. అయితే.. ఆ రెండు దేశాలు స్పందించకుండా, మౌనం పాటించాయి. ఓవైపు అమెరికా ఏమో, తమ ట్యాంకులు వాడాలంటే టెక్నాలజీపై కఠిన శిక్షణ అవసరమని చెప్తే.. మరోవైపు జర్మనీ, తమ ట్యాంకులను ఉక్రెయిన్‌కి ఇస్తే నాటో నేరుగా యుద్ధంలో జోక్యం చేసుకున్నట్లు అవుతుందని పేర్కొంది. అంతేకాదు.. అమెరికా ట్యాంకులు పంపితేనే, తాము తమ ట్యాంకుల్ని ఇస్తామంటూ జర్మనీ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ‘నాటో’లో అభిప్రాయబేధాలు నెలకొన్నాయి. చివరికి.. జర్మనీ షరతు మేరకు అమెరికా ట్యాంకులు ఇచ్చేందుకు దిగిరావడంతో, జర్మనీ సైతం లెపర్డ్-2 ట్యాంకులు ఉక్రెయిన్‌కు ఇచ్చేందుకు ముందుకొచ్చింది. అటు.. నాటోలో సభ్యత్వం కలిగిన ఉన్న బ్రిటన్ దేశం ఇప్పటికే తమ ‘ఛాలెంజర్ ట్యాంకు’లను ఉక్రెయిన్‌కి అందించేందుకు రెడీ అయ్యింది. ఇవి రష్యాకు ధీటుగా బదులివ్వడానికి ఉక్రెయిన్‌కి సహాయపడతాయి.
Siraj: నెంబర్‌వన్ బౌలర్‌గా సిరాజ్..ర్యాంకింగ్స్‌లో హైదరాబాదీ పేసర్ జోరు