NTV Telugu Site icon

Anant Radhika wedding: 2 నెలల పాటు అనంత్-రాధిక వెడ్డింగ్ వేడుకలు.. ఎక్కడంటే..!

Anantambaniwedding

Anantambaniwedding

ప్రపంచ కుబేరుడు ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహ వేడుకలు మరో రెండు నెలల పాటు జరగనున్నాయి. ఈ వేడుకలను గ్రాండ్ నిర్వహించేందుకు ముఖేష్ అంబానీ కుటుంబం ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం లండన్‌లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంతర్జాతీయంగా మరింత గుర్తింపు వచ్చేలా.. ఈ వెడ్డింగ్ వేడుకలు నిర్వహించాలని ప్లాన్ చేశారు. ఇందుకోసం లండన్‌లోని సెవెన్ స్టార్ స్టోక్ పార్క్ హోటల్‌ను రెండు నెలలకు అంబానీ కుటుంబం బుక్ చేసినట్లు తెలుస్తోంది.

లండన్‌లో నిర్వహించే ఈ వివాహ వేడుకలకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులను ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు, సెప్టెంబర్‌లో జరిగే ఈ వేడుకలకు అతిరథ మహరథులంతా హాజరుకానున్నారు. ప్రతి రోజూ ఆయా కార్యక్రమాలు జరిగేలా ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.

జూలై 12న అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహం జరిగింది. ఈ వేడుకలను మూడు రోజుల పాటు అంతరంగ వైభవంగా నిర్వహించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వీవీఐపీలంతా హాజరయ్యారు. ఇక హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్.. ఇలా అన్ని రంగాలకు చెందిన ప్రముఖలంతా హాజరై సందడి చేశారు. అంతకముందు ప్రీ-వెడ్డింగ్ వేడుకలు కూడా మార్చి 1-3 వరకు నిర్వహించారు. ఈ వేడుకలకు కూడా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అత్యంత ప్రముఖులు హాజరై సందడి చేశారు. ఇప్పుడైతే ఏకంగా రెండు నెలల పాటు యూకేలో వివాహ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకు ప్రిన్స్ హ్యారీ, యూకే మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ హాజరయ్యే అవకాశం ఉంది. లండన్‌లో ధూంధాంగా వెడ్డింగ్ వేడుకలు నిర్వహించేందుకు అంబానీ ఫ్యామిలీ సన్నాహాలు చేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.