Iran-Israel War: ఇరాన్‌ నివాసాలపై ఇజ్రాయెల్, అమెరికా దాడి.. 26 మంది మృతి

  • ఇరాన్‌ నివాసాలపై ఇజ్రాయెల్, అమెరికా దాడి
  • 26 మంది మృతి
  • మృతుల్లో ఏడుగురు మహిళలు, ఏడుగురు చిన్నారులు
Iranwar

Iranwar

ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఇరాన్‌లోని ఇస్ఫాహాన్‌లో అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడి చేశాయి. నివాసాలపై దాడి చేయడంతో 26 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇరాన్‌లోని ఇస్ఫహాన్ ప్రావిన్స్‌లో అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో కనీసం 26 మంది మరణించినట్లు ఫార్స్ న్యూస్ ఏజెన్సీ నివేదించింది. నివాస ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఈ దాడుల్లో ఏడుగురు మహిళలు, ఏడుగురు చిన్నారులు ఉన్నారని పేర్కొంది.

గత నెల 28న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హతమయ్యాడు. అనంతరం ఇరాన్ ప్రతీకార దాడులు చేసింది. గల్ఫ్ దేశాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు చేసింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా గ్యాస్, చమురు కష్టాలు మొదలయ్యాయి. ఇక హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేసింది. అంతేకాకుండా ఇజ్రాయెల్, అమెరికా మిత్రదేశాలకు చెందిన ఆయిల్ ట్యాంకర్లను విడిచిపెట్టబోమని ఇరాన్ తేల్చి చెప్పింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.