Site icon NTV Telugu

Brazil: బ్రెజిల్‌లో తప్పిన ఘోర విమాన ప్రమాదం.. టేకాఫ్ అవుతుండగా పెద్ద ఎత్తున మంటలు

Latam Airlines

Latam Airlines

బ్రెజిల్‌లో ఘోర విమాన ప్రమాదం తప్పింది. సావోపాలోలోని గ్వారుల్హోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 180 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న విమానం టేకాఫ్ అవుతుండగా ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. దీంతో ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది వెంటనే అప్రమత్తం అయి మంటలు అదుపు చేశారు. దీంతో ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించేశారు. ప్రాణాలతో బయటపడడంతో ఊపిరి పీల్చుకున్నారు.

అకస్మాత్తుగా క్యాబిన్ నుంచి మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు. కిటికీలు, రెక్కల క్రింద నుంచి మంటలు చెలరేగాయిని.. ప్రయాణికులు చూసి అప్రమత్తం అయినట్లు అధికారులు వెల్లడించారు. వెంటనే ఎయిర్‌పోర్టు సిబ్బంది అప్రమత్తమై ప్రయాణికులను సురక్షితంగా దించేసినట్లు చెప్పారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. అందులో విమానం నుంచి పెద్ద ఎత్తున అగ్నికీలలు ఎగిసిపడుతున్నట్లు కనిపించింది. దట్టంగా పొగ కమ్ముకుంది. ఇక ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి పంపించారు.

 

Exit mobile version