NTV Telugu Site icon

Couple Revenge: దంపతుల ప్రతీకారం.. ఎయిర్‌బీఎన్‌బీ కంపెనీకి భారీ నష్టం

China Couple Airbnb

China Couple Airbnb

Airbnb host left shocked when a Chinese couple took revenge in a startling way: తాము కోరుకున్నది దక్కనప్పుడు.. ఇతరులకు నష్టం కలిగించాలన్న మెంటాలిటీ చాలామందిలో ఉంటుంది. అందుకోసం వాళ్లు ఏం చేయడానికైనా సిద్ధపడుతారు. ఇప్పుడు ఓ జంట కూడా అలాగే బరి తెగించింది. తాము కోరుకున్నట్టు విల్లా లభించలేదని, అలాగే తమ డబ్బులు తిరిగి ఇవ్వలేదన్న కోపంతో.. విల్లా యజమానికి, ఎయిర్‌బీఎన్‌బీ సంస్థకు భారీ నష్టం వాటిల్లేలా చేశారు. తాము అనుకున్నది దొరక్కపోవడంతో.. వాళ్లకు నష్టం కలిగించి, తమ ప్రతీకారం తీర్చుకోవాలని వాళ్లు ఆ పని చేశారు. అసలేం జరిగిందంటే..

Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో ఛార్జ్ షీట్

చైనాకు చెందిన భార‍్యభర్తలు సౌత్‌ కొరియాలో సియోల్‌లో 25 రోజుల పాటు వెకేషన్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇంకేముంది.. వెంటనే వాళ్లు ‘వెకేషన్ రెంటల్ కంపెనీ ఎయిర్‌బీఎన్‌బీ’లో లాగిన్ అయ్యి, సియోల్‌లో ఒక విల్లాను బుక్‌ చేసుకున్నారు. ఇక్కడ వీళ్లు చేసిన తప్పేమిటంటే.. ఆ విల్లా ఎగ్జాక్ట్‌గా ఏ ప్రాంతంలో ఉంది? అనే వివరాల్ని శోధించలేదు. అలాగే.. ఆ విల్లా యజమానిని సైతం సంప్రదించలేదు. విల్లాను బుక్ చేసుకున్న తర్వాత.. అది నగరంలో లేదని, ఎక్కడో శివారు ప్రాంతంలో ఉందని ఆ దంపతులకు తెలిసింది. దీంతో ఖంగుతిన్న ఆ భార్యాభర్తలు.. తమ బుకింగ్‌ని క్యాన్సిల్ చేసుకోవాలని అనుకున్నారు. ఇందుకు ఆ విల్లా యజమానిని సంప్రదించారు. తాము చెల్లించిన డబ్బు తిరిగి ఇవ్వాలని, తాము నగరంలో మరో విల్లా బుక్ చేసుకుంటామని చెప్పారు. కానీ.. విల్లా యజమాని అందుకు అంగీకరించలేదు. ఒకసారి బుక్ చేసుకున్నాక.. డబ్బులు తిరిగి ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పాడు. దీంతో.. చేసేదేమీ లేక చైనా నుంచి సియోల్‌కు వచ్చిన ఆ జంట, విల్లా ఓనర్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని ఫిక్స్ అయ్యారు.

Qamar Javed Bajwa: పాకిస్తాన్ ఆర్మీకి అంత సీన్ లేదు.. పాక్ ఆర్మీ మాజీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు

విల్లాలో దిగిన అనంతరం ఆ దంపతులు లీకి ఫోన్ చేసి, మీ విల్లాలో నిఘా కెమెరాలు ఉన్నాయా? అవి పనిచేస్తున్నాయా? అడిగారు. అందుకు తమ విల్లాలో సీసీ కెమెరాలు లేవని లీ సమాధానం ఇచ్చాడు. ఇంకేముంది.. ఆ దంపతులు తమ ప్లాన్‌ని అమలు చేశారు. అవసరానికి మించి లైట్లు, ట్యాప్‌లు, ఎలక్ట్రికల్ ఉపకరణాలు, గ్యాస్ ట్యాప్‌లను ఆన్ చేశారు. ప్రతీకారం తీర్చుకోవాలని ఫిక్స్ అయ్యారు కాబట్టి.. వాళ్లు ఆ విల్లాలోనే ఎక్కువ సమయం గడిపారు. 25 రోజుల్లో కేవలం ఐదుసార్లు మాత్రమే, అది కూడా ఐదు నిమిషాలు మాత్రమే సియోల్‌ను సందర్శించారు. ఇక తమ గడువు ముగియడంతో.. ఆ దంపతులు ఆ విల్లాను ఖాళీ చేసి, అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇంతలో ఆ విల్లా యజమాని లీయోకి ఒక ఫోన్ వచ్చింది. మీ విల్లాలో గ్యాస్ వినియోగం ఎక్కువగా జరిగిందని.. గ్యాప్ కంపెనీ అధికారులు ఫోన్ చేసి చెప్పారు. దీంతో.. విల్లాలో ఏదైనా ప్రమాదం జరిగిందేమోనని, లీ వెంటనే తమ విల్లాకు వెళ్లాడు. అక్కడికి వెళ్లాక.. ఆ దంపతులు పని చేసి, అతడు షాక్‌కు గురయ్యాడు.

BoyapatiRAPO: ఏం..బోయామామ.. మా రామ్ ను ఆ పనికూడా చేయనివ్వడం లేదా..?

ఆ విల్లాలో గ్యాస్ టాప్ ఆన్ చేసిన చైనా దంపతులు.. అదంతా బయటకు వెళ్లడానికి కిటికీలో తెరిచే ఉంచారు. వాళ్లు చేసిన ఈ పనికి.. $728 (రూ. 59,660) గ్యాస్ బిల్లు వచ్చింది. అలాగే.. 120,000 లీటర్ల కంటే ఎక్కువగా నీటిని వృధా చేయడంతో.. $116 (రూ. 9,506) నీటి బిల్లు వచ్చింది. కరెంట్‌ని కూడా విస్తృతంగా వినియోగం చేయడంతో.. $730 (రూ. 59,824) బిల్లు వచ్చినట్టు తేలింది. మొత్తంగా చూసుకుంటే.. రూ.1.2 లక్షలు ఆ విల్లా యజమానికి నష్టం వాటిల్లింది. ఈ వ్యవహారంపై ఎయిర్‌బీఎన్‌బీ సంస్థ కూడా స్పందించింది. ఆ భార్యాభర్తల ప్రతీకారంతో తమకు చాలా నష్టం వాటిల్లిందని తెలిపింది. కాగా.. ఆ దంపతులపై తాను కూడా ప్రతీకారం తీర్చుకుంటానని, వాళ్లిద్దరూ ఎక్కడున్నా కటకటల్లోకి పంపిస్తానని విల్లా యజమాని లీ వార్నింగ్ ఇచ్చాడు.