Site icon NTV Telugu

Air India Express Plane: ఎయిరిండియా విమానంలో అగ్నిప్రమాదం.. మస్కట్‌లో ఘటన

Air India Express Flight

Air India Express Flight

Air India Express Plane Catches Fire At Muscat: ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి తృటితో ప్రమాదం తప్పింది. ఒమన్ రాజధాని మస్కన్ నుంచి కొచ్చికి బయలుదేరాల్సిన విమానంలో అగ్ని ప్రమాదం జరిగింది. టేకాఫ్ కు ముందు ఈ ప్రమాదం సంభవించింది. వెంటనే అప్రమత్తం అయిన ఎయిర్ పోర్టు సిబ్బంది మంటలను ఆర్పివేసి.. ప్రయాణికులను రక్షించారు.

బుధవారం మస్కట్ నుంచి కొచ్చికి బయలుదేరాల్సిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం టాక్సీవే నుంచి రన్ వే పైకి వస్తున్న సమయంలో విమానంలో పొగలు వ్యాపించాయి. ఆ సమయంలో విమానంలో ఫ్లైట్ క్రూతో మొత్తం 145 మంది ప్రమాణికలుు ఉన్నారు. వీరలో నలుగురు చిన్న పిల్లలు ఉన్నారు. వెంటనే రెస్క్యూ సిబ్బంది విమానంలోని ప్రయాణికులను బయటకు తీసుకువచ్చారు. ప్రయాణికులను ఎయిర్ పోర్టు టర్మినల్ భవనానికి తరలించారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులెవ్వరికీ అపాయం కలగలేదు. అంతా క్షేమంగా ఉన్నారు.

Read Also: Rashmika Mandanna: లోక్ సభ ఎంపీగా రష్మిక..?

విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో టాక్సీవే నుంచి రన్ వే పైకి వచ్చింది. ఆ సమయంలో ఫ్లైట్ నెంబర్ ఐఎక్స్ 442 విమానంలోని రెండో ఇంజిన్ అగ్ని ప్రమాదం జరిగింది. వెంటనే అప్రమత్తం అయిన సిబ్బంది అత్యవసర ద్వారాలను ఉపయోగించి ప్రయాణికులను విమానం కిందికి దించారు. పెద్ద ప్రమాదం నుంచి ప్రయాణికులంతా బయటపడ్డారు. గతేడాది ఎయిరిండియాను టాటా సంస్థ కొనుగోలు చేసిన విషయం తెలిసింది.

Exit mobile version