Pakistan: పాకిస్తాన్‌లో అసలేం జరగుతోంది. ఎవరికీ అంతుచిక్కకుండా గుర్తు తెలియని వ్యక్తులు భారత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల్ని లేపేస్తున్నారు. ఇప్పటికే పలువురు ఉగ్రవాదులు ఇలాగే చంపివేయబడ్డారు. తాజాగా మరో ఉగ్రవాదిని లేపేశారు. లష్కరే తోయిబా ఉగ్రసంస్థలో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల్లో ఒకరైన ముఫ్తీ ఖైజర్ ఫరూఖ్‌ని కరాచీ నగరంలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు.
ఖైజర్ ఫరూక్ లష్కరేతోయిబా వ్యవస్థాపక సంభ్యుల్లో ఒకరు. 26/11 ముంబై ఉగ్రదాడి ప్రధాన సూత్రధారి అయిన హఫీస్ సయాత్‌కి ఖైజర్ ఫరూఖ్ అత్యంత సన్నిహిత సహచరుడు. పాకిస్తాన్ డాన్ పత్రిక, పోలీస్ వర్గాల కథనం ప్రకారం.. శనివారం కరాచీలోని సమనాబాద్ ప్రాంతంలోని మతపరమైన సంస్థ సమీపంలో 30 ఏళ్ల ఖైజర్ ఫరూఖ్ లక్ష్యంగా దాడి చేసి చంపారు. అతని వెనక భాగంలో బుల్లెట్ గాయాలయ్యాయి, ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. ఫరూఖ్ హత్యకు సంబంధించి సీసీటీవీ విజువల్స్ అక్కడి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ దాడిలో 10 ఏళ్ల బాలుడు కూడా గాయపడ్డాడు.
Read Also: PM MODI: హైదరాబాదులో అడుగు పెట్టిన ప్రధాని.. మహబూబ్‌నగర్‌కు పయనం
ఇదిలా ఉంటే హఫీస్ సయీద్ కొడుకు కమాలుద్దీన్ సయీద్‌ని గత వారం గుర్తుతెలియన వ్యక్తులు పెషావర్ లో కిడ్నాప్ చేశారు. అతడి వివరాల కోసం పాక్ గూఢాచార సంస్థ ఐఎస్ఐ ఎంత వెతికినా దొరకలేదు. అయితే అతడిని చంపేసినట్లు కథనాలు వస్తున్నాయి. దీనికి ముందు కీలక ఉగ్రవాది జియావుల్ రెహ్మాన్ ని గుర్తు తెలియని వ్యక్తుల కాల్చి చంపారు. అంతకుముందు కూడా పాకిస్తాన్‌లో ఇద్దరు ఖలిస్తానీ ఉగ్రవాదుల్ని, మరికొందరు ఇస్లామిక్ ఉగ్రవాదుల్ని ఇలాగే కాల్చి చంపారు.