Site icon NTV Telugu

ఆ న‌గరంలో మ‌రోసారి లాక్‌డౌన్‌…90 ల‌క్ష‌ల మందికి మ‌ళ్లీ టెస్టులు…

2019 నవంబర్ నుంచి చైనాలో క‌రోనా కేసులు బ‌య‌ట‌ప‌డ‌టం మొదలుపెట్టాయి.  డిసెంబర్ నుంచి కేసులు పెరగడం మొదలుపెట్టాయి.  చైనా నుంచి కేసులు ఇతర దేశాలకు వ్యాపించడం మొదలయ్యాయి.   ఆ తరువాత ప్రపంచంలోని అనేక దేశాల్లో లాక్‌ డౌన్ అమలు చేస్తూ వచ్చారు.   గత రెండేళ్లుగా కట్టడికి చర్యలు  తీసుకుంటున్నా క‌రోనా ఏ మాత్రం త‌గ్గ‌డంలేదు.  వైరస్ తన రూపాన్ని మార్చుకుంటూ రూపాంతరాలు చెందుతూ బలం పెంచుకొని మ‌రోమారు విజృంభిస్తున్నది.  ప్ర‌పంచంలోని దాదాపుగా 130 దేశాల్లో డెల్టావేరియంట్ వ్యాపించింది.  ఇప్పుడు ఈ వేరియంట్ కేసులు చైనాలో వెలుగుచూస్తున్నాయి.  ఆ దేశంలోని జియాంగ్‌సూ ప్రావిన్స్‌లోని నాంజింగ్ న‌గ‌రంలో ఇటీవ‌లే 18 డెల్టా వేరియంట్ కేసులు వెలుగుచూశాయి.  

Read: ప్రియాంక జవాల్కర్ మూడు చిత్రాల ముచ్చట!

దీంతో అధికారులు అప్ర‌మ‌త్తం అయ్యారు.  ఆ దేశంలో ఇప్ప‌టికే కోట్లాదిమందికి క‌రోనా వ్యాక్సిన్ డోసుల‌ను ప్ర‌భుత్వం అందించింది.  అయిన‌ప్ప‌టికీ కేసులు న‌మోద‌వుతుండ‌టంతో వ్యాక్సిన్ ప్ర‌భావంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి.  మూడో డోస్ వ్యాక్సిన్ కూడా ఇచ్చేందుకు చైనా సిద్దం అవుతున్న‌ది.  ఇక‌, నాంజింగ్ న‌గ‌రంలో 18 డెల్లా వేరియంట్ కేసులు న‌మోదుకావ‌డంతో ఆ న‌గ‌రంలో మ‌రోసారి లాక్‌డౌన్‌ను అమ‌లు చేస్తున్నారు.  న‌గ‌రంలోని 90 ల‌క్ష‌ల మంది జ‌నాభాకు మ‌రోసారి క‌రోనా నిర్ధార‌ణ టెస్టులు నిర్వ‌హించాల‌ని అధికారులు నిర్ణ‌యం తీసుకున్నారు.  ఇప్ప‌టికే ఆ న‌గ‌రంలో రెండుసార్లు 90 ల‌క్ష‌ల మంది జ‌నాభాకు రెండుసార్లు టెస్టులు నిర్వ‌హించారు.  కాగా ఇప్పుడు మూడోసారి కూడా జ‌నాభా మొత్తానికి టెస్టులు నిర్వ‌హించ‌బోతున్నారు.  

Exit mobile version