Site icon NTV Telugu

Kashmir: 30 ఏళ్ల తర్వాత కశ్మీర్ లో ప్రారంభంకానున్న సినిమా థియేటర్లు

Kashmir

Kashmir

Cinema theaters to open in Kashmir after 30 years: సుమారు 3 దశాబ్దాల తర్వాత కశ్మీరీలు థియేటర్లో సినిమా చూడబోతున్నారు. కశ్మీర్ లోయలో హింస కారణంగా 1990లో అక్కడి ప్రజలకు సినిమా వినోదం దూరమైంది. భయాందోళనలు, దాడి జరుగుతుందోనన్న భయం కారణంగా అక్కడ సినిమా థియేటర్లు మూసివేశారు. ఇప్పుడక్కడ మునుపటితో పోల్చితే ఓ మోస్తరు సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. దీంతో.. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత కశ్మీరీ ప్రజలకు సినిమా వినోదం మళ్లీ చేరువ కానుంది.

ప్రస్తుతం శ్రీనగర్ లో ఐనాక్స్ సంస్థ మల్టీప్లెక్స్ థియేటర్ నిర్మిస్తోంది. 520 మంది కెపాసిటీతో సిద్ధమవుతున్న ఈ మల్టీప్లెక్స్ వచ్చేనెల (సెప్టెంబర్)లో అందుబాటులోకి రానుంది. ఈ మల్టీప్లెక్స్ లో ఆధునిక సౌండ్ సిస్టమ్, 3 ఆడిటోరియాలు, ఫుడ్ కోర్టులు ఉంటాయని ఐనాక్స్ సంస్థ తెలిపింది. అంతేకాదు సిట్టింగ్ సామర్థ్యం, ఫుడ్ కోర్టులు, చిన్నారులు ఆడుకునేందుకు మెషీన్ టాయ్స్ వంటివి కూడా అందుబాటులో ఏర్పాటు చేస్తున్నారు.

కాశ్మీర్‌లో మల్టీప్లెక్స్‌ను ప్రారంభించాలనే ఆలోచన, దేశంలోని ఇతర ప్రాంతాల యువతకు ఉన్నటువంటి సౌకర్యాలను యువతకు అందించడమేనని ప్రాజెక్ట్ చైర్మన్ విజయ్ ధర్ తెలిపారు.30 సంవత్సరాలుగా ఇక్కడ అలాంటిదేమీ లేదని ఆయన తెలిపారు. సినిమా థియేటర్లు ఎందుకు ప్రారంభం చేయకూడదని అనుకున్నాము? కాబట్టి ఇప్పుడు ప్రారంభించామని ప్రాజెక్ట్ చైర్మన్ విజయ్ ధర్ అన్నారు.

Exit mobile version