Site icon NTV Telugu

Pakistan: సోషల్ మీడియాలో పాక్ నటి ప్రైవేటు వీడియో లీక్.. ఖండించిన మథిర

Mathiramohammad

Mathiramohammad

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక విచ్చలవిడితనం పెరిగిపోయింది. ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో ఆన్‌లైన్‌లోకి వచ్చేస్తున్నాయి. సెన్సార్ లేకపోవడంతో ఇష్టానురీతిగా వీడియోలు పోస్టులు చేస్తున్నారు. దీంతో కొందరి వ్యక్తిగత జీవితాలు బద్నాం అవుతున్నాయి. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. కంటెంట్ పోస్టు చేసేవాళ్లలో మార్పు రావడం లేదు. తాజాగా పాకిస్థాన్‌కు చెందిన ఒక ఇన్‌ఫ్లుయెనర్స్‌కు చెందిన ఒక ప్రైవేటు వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఇది కూడా చదవండి: Nikhil Siddhartha UNIK: తనకు తానే కొత్త స్టార్ ట్యాగ్ ఇచ్చుకున్న స్టార్ హీరో.. ఇకపై అలాగే పిలవాలంటూ

పాకిస్థాన్‌లో టీవీ యాంకర్‌గా పనిచేస్తున్న మథిర మహ్మద్‌‌కు చెందిన ప్రైవేటు వీడియోలు వైరల్‌గా మారాయి. ఈమె మోడల్‌, డ్యాన్సర్‌, సింగర్‌, నటిగా పేరు ప్రఖ్యాతలు స్పందించింది. సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటారు. లక్షల సంఖ్యలో ఫాలోవర్లు కూడా ఉన్నారు. తాజాగా ఆమె వ్యక్తిగతమైన వీడియో ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమైంది. అయితే ఈ వీడియోను మధిర ఖండించారు. తన పేరు, ఫొటోలను దుర్వినియోగం చేస్తూ ఫేక్‌ కంటెంట్‌ను వ్యాప్తి చేస్తున్నారని మండిపడ్డారు. ఇటువంటి చర్యలకు తనను దూరంగా ఉంచాలంటూ ఎక్స్‌ ఖాతాలో పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Powerlifting Championship: పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో సత్తాచాటిన భారతీయ తండ్రీ కొడుకులు

ఇటీవల పాకిస్థాన్ టిక్‌టాక్ స్టార్ ఇమ్షా రెహ్మాన్ కూడా ప్రైవేట్ వీడియో ఇలానే వైరల్ అయ్యింది. ఆమె వ్యక్తిగత దృశ్యాలు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేశాయి. అయితే ఆ వీడియోను ఆమెనే సోషల్ మీడియాలో పోస్టు చేసిందంటూ నెటిజన్లు విమర్శించారు. ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు ఆమె ఉద్దేశపూర్వకంగా ఇలా చేసిందంటూ పలువురు కామెంట్లు చేశారు.

 

Exit mobile version