Site icon NTV Telugu

ఆ దేశ త‌ల‌రాత‌ను మార్చిన 2001 దాడులు…

2001లో అమెరికాలోని వ‌ర‌ల్డ్ ట్రేడ్ ట‌వ‌ర్స్‌పై అల్‌ఖైదా ఉగ్ర‌వాదులు దాడులు చేశారు.  ఈ దాడిలో వ‌ర‌ల్డ్ ట్రేడ్ ట‌వ‌ర్స్ పూర్తిగా ధ్వంసం అయ్యాయి.  దీంతో అప్ప‌టి అమెరికా అధ్య‌క్షుడు జూనియ‌ర్ బుష్ ఆఫ్ఘ‌నిస్తాన్‌లోని అల్‌ఖైదా నాయ‌కుడు లాడెన్ ఉన్నాడని, అత‌డిని త‌మ‌కు అప్ప‌టించాల‌ని అమెరికా కోరింది.  కానీ, అందుకు అప్ప‌టి తాలిబ‌న్ ప్ర‌భుత్వం అంగీక‌రించ‌లేదు.  దీంతో ఆఫ్ఘ‌న్‌లోని తాలిబ‌న్ సేన‌ల‌పై అమెరికా సైనికులు దాడులు చేశారు.  తాలిబ‌న్‌ల‌ను త‌రిమికొట్టి ఆ దేశంలో ప్ర‌జాస్యామ్య ప్ర‌భుత్వాన్ని నెల‌కొల్పారు.  అప్ప‌టి నుంచి 20 ఏళ్ల‌పాటు ఆఫ్ఘ‌న్‌లో సుస్థిర‌మైన పాల‌న కొన‌సాగింది.  2001లో అల్‌ఖైదా ఉగ్ర‌వాదులు అమెరికాపై దాడులు చేయ‌కుంటే ఆఫ్ఘ‌నిస్తాన్ తాలిబ‌న్ల పాల‌న‌లో మ‌గ్గిపోయేది.  తాలిబ‌న్ల అరాచ‌కాల‌ను అడ్డులేకుండాపోయేది.  ఇప్పుడు మ‌రోమారు ఆఫ్ఘ‌న్ పాల‌న తాలిబ‌న్ల చేతిలోకి వెళ్ల‌డంతో ఎలాంగి ఆరాచ‌కాలు సృష్టిస్తారో అని భ‌య‌ప‌డుతున్నారు.  

Read:

Exit mobile version