NTV Telugu Site icon

తాలిబన్ల మరో సంచలన నిర్ణయం.. ఏకంగా ఆ శాఖే ఎత్తేశారు..!

ఆఫ్ఘనిస్థాన్‌లో తమ ఆధీనంలోకి తీసుకున్న తాలిబన్లు.. తమ అరాచకాలను కొనసాగిస్తున్నారు.. గతంలో ప్రజాస్వామ్య ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలను రద్దు చేస్తున్నారు.. మహిళలకు రక్షణ కల్పిస్తామంటూనే.. మహిళలపై ఆంక్షలు విధిస్తూ వస్తున్నారు.. ఏ ఆటలు ఆడొద్దంటూ ఆదేశాలు జారీ చేశారు.. బాలురు-బాలికలు కలిచి చదువుకోవడానికి వీలులేదని స్పష్టంచేశారు.. బాలికలకు మహిళలే పాఠాలు చెప్పాలని.. మహిళలు బాలురకు కూడా పాఠాలు బోధించొద్దు అంటూ.. పిచ్చిపిచ్చి షరతులు పెట్టారు.. ఒకేవేళ కో-ఎడ్యుకేషన్‌ కొనసాగినా.. తరగతి గదిలో అమ్మాయిలు, అబ్బాయిలకు మధ్య తెరలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు..

ఇక, తమకు రక్షణ కల్పించాలంటూ.. ప్రభుత్వంలో అవకాశం ఇవ్వాలంటూ ఓవైపు మహిళలు ఆందోళన చేస్తున్న సమయంలో.. ఏకంగా మహిళా మంత్రిత్వ శాఖ పేరునే మార్చేశారు తాలిబన్లు.. గత 20 ఏళ్లుగా ఉన్న మహిళా మంత్రిత్వ శాఖ భవనానికి ‘ధర్మ రక్షణ, అధర్మ నిర్మూలన’ శాఖ అని పేరు పెట్టారు. ఆ మేరకు దరి, అరబ్బీ భాషల్లో బోర్డులు ఏర్పాటు చేశారు. కాగా.. మహిళలను ఉద్యోగం చేయనివ్వాలంటూ కాబూల్‌లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వంలో కూడా చోటు కల్పించాలని ఆందోళన చేస్తుండగా.. అవి ఏవీ పట్టని తాలిబన్లు.. ప్రపంచంలోనే కరుడుగట్టిన ఉగ్రవాదులతో కేబినెట్‌ ఏర్పాటు చేశారు.. వారి కేబినెట్‌లో ఒక్క మహిళకు కూడా స్థానం లేకపోండంతో.. అసలు మహిళా మంత్రిత్వశాఖ ఎందుకు అనుకున్నారో ఏమో.. ఆ శాఖ పేరునే మార్చి.. మరోసారి వార్తల్లో నిలిచారు తాలిబన్లు.