Site icon NTV Telugu

ఆఫ్ఘ‌న్‌లో మరో యుద్ధం: తాలిబ‌న్ల‌తో మాజీ ఉపాధ్యక్షుడు పోరాటం…

ఆఫ్ఘ‌నిస్తాన్‌ను తాలిబ‌న్లు ఆక్ర‌మించుకున్నాక అక్క‌డి ప‌రిస్థితులు దారుణంగా మారిపోయాయి.  తాలిబ‌న్ల‌కు పాకిస్తాన్ స‌హాయం చెసింద‌ని అనేక దేశాలు ఆరోపిస్తున్నాయి.  పాక్‌లో ఉగ్ర‌వాద సంస్థ‌లు అనేకం ఆశ్ర‌యం పోందుతున్నాయి.  తాలిబ‌న్లు ఆక్ర‌మించుకునే ముందు రోజు ఆ దేశ అధ్య‌క్షుడు అష్రాఫ్ ఘ‌నీ దేశం విడిచి పారిపోయారు.  అయితే, ప్ర‌స్తుతం ఉపాద్య‌క్షుడు తాలిబ‌న్ల‌పై పోరాటం చేసేందుకు సిద్ధం అవుతున్నాడు.  ఆఫ్ఘ‌న్‌ను త‌న‌లో క‌లుపుకునేంత ద‌మ్ము పాక్‌కు లేద‌ని, పాలించేంత‌టి సీన్ తాలిబ‌న్ల‌కు లేద‌ని మాజీ ఉపాధ్య‌క్షుడు అమ్రుల్లా స‌లేహ్ పేర్కొన్నారు.  ప్ర‌స్తుతం అమ్రుల్లా పంజ్‌షిర్ లోయ‌లో ఉన్న ఆయ‌న దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ట్వీట్ చేశారు.  ఉగ్ర‌మూక‌ల‌కు త‌ల‌వొంచ‌వ‌ద్ద‌ని దేశ ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు.  చ‌ట్టాల‌ను గౌర‌వించాలి త‌ప్ప హింస‌ను కాద‌ని అన్నారు.  పంజ్‌షిర్‌లో ఉన్న అమ్రుల్లా అక్క‌డి నుంచే తాలిబ‌న్ల‌పై గెరిల్లా యుద్ధం చేసేందుకు సిద్ద‌మౌతున్న‌ట్టు పేర్కొన్నారు.  గ‌తంలో తాలిబ‌న్ల‌కు వ్య‌తిరేకంగా పోరాటం చేసిన అహ్మ‌ద్ షా మ‌సౌద్ త‌న‌యుడితో క‌లిపి తాలిబ‌న్ల‌పై గెరిల్లా త‌ర‌హా యుద్దం చేయ‌బోతున్న‌ట్టు ఆయ‌న పేర్కొన్నారు. ఆఫ్ఘ‌నిస్తాన్ మొత్తం తాలిబ‌న్ల వ‌శం అయిన‌ప్ప‌టికీ పంజ్‌షిర్ మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రి సొంతం కాలేదు.  తాలిబ‌న్లు అనేక విధాలుగా ప్ర‌య‌త్నం చేసినా ఈ ప్రాంతాన్ని మాత్రం ఆక్ర‌మించుకోలేక‌పోయారు. అంతేకాదు, అటు ఆఫ్ఘ‌న్ సైనికులు సైతం పంజ్ షిర్‌కు చేరుకుంటున్నార‌ని, సైన్యంతో క‌లిసి గెరిల్లా యుద్ధాన్ని చేస్తామ‌ని అమ్రుల్లా తెలిపారు.  

Read: ఇరాన్‌లో వ్యాక్సిన్ సంక్షోభం… బ్లాక్‌లో భారీ ధ‌ర‌ల‌కు…

Exit mobile version