Site icon NTV Telugu

Pakistan-Afghanistan: పాకిస్థాన్‌పై తాలిబన్ల భారీ దాడి.. యుద్ధం తప్పదా?

Pakistanafghanistan

Pakistanafghanistan

పాకిస్థాన్‌పై ఆఫ్ఘనిస్థాన్ ప్రతీకార దాడులకు శ్రీకారం చుట్టింది. పాక్‌లోని కొన్ని స్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడులకు దిగింది. ఈ విషయాన్ని ఆఫ్ఘనిస్థాన్ రక్షణ మంత్రిత్వశాఖ వెల్లడించింది. పాకిస్తాన్‌లోని అనేక ప్రదేశాలపై ఆఫ్ఘన్ తాలిబన్లు దాడి చేశారని ఆఫ్ఘనిస్తాన్ రక్షణ మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. ఇటీవల పాకిస్తాన్ వైమానిక బాంబు దాడిలో కనీసం 46 మంది ఆఫ్ఘని వాసులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా దీనికి ప్రతీకారంగా ఆఫ్ఘనిస్థాన్ దాడులు చేస్తోంది.

ఇది కూడా చదవండి: Manmohan Singh: మన్మోహన్ సింగ్ కోసం భూటాన్ ప్రత్యేక ప్రార్థనలు..

తాలిబన్ల దాడులపై ఇప్పటివరకు పాక్‌ స్పందించలేదు. ఆఫ్ఘనిస్థాన్‌ను తాలిబన్‌లు ఆక్రమించుకున్న తర్వాత తాజాగా సరిహద్దులో  తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల తమ దేశంలో జరిగిన పలు ఉగ్రదాడులకు తాలిబన్లే కారణమని పాకిస్థాన్‌ ఆరోపిస్తోంది. ఈ ఆరోపణలను తాలిబన్‌ వర్గాలు తీవ్రంగా ఖండించాయి. ఈ ఏడాది మార్చిలో ఆఫ్ఘనిపై దాడులు చేసిన పాక్‌.. ఇటీవల మరోసారి వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో 46 మంది ప్రాణాలు కోల్పోగా పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నట్లు తాలిబన్ ప్రభుత్వం వెల్లడించింది. ఈ దాడులపై పాక్‌ నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు. తమ దేశంపై దాడులకు పాల్పడిన వారిపై ప్రతీకారం తీర్చుకుంటామని తాలిబన్లు హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: HCA: అండర్19 టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌కు తెలంగాణ క్రికెట‌ర్లు ఎంపిక.. ఘ‌నంగా స‌న్మానం

Exit mobile version