Site icon NTV Telugu

తజికిస్థాన్‌ లో ఆఫ్ఘన్‌ అధ్యక్షుడు..

ఆఫ్ఘనిస్థాన్‌ పూర్తిగా తాలిబాన్లు హస్తగతమైంది. అధ్యక్షపదవికి రాజీనామా చేసిన అష్రఫ్‌ ఘనీ, కీలక బృందంతో కలిసి దేశం వెళ్లిపోయారు. తన నిష్క్రమణపై అష్రఫ్‌ ఘనీ ట్వీట్‌ చేశారు. తాలిబాన్లతో జరిగిన పోరాటంలో ఇప్పటికే అనేక మంది చనిపోయారని గుర్తు చేశారు. మరింత రక్తపాతం జరగకుండా అధికారం నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. తుపాకులు, కత్తులతో ఆఫ్ఘనిస్థాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లపై ప్రజల గౌరవం, శాంతిభద్రతల్ని కాపాడాల్సిన బాధ్యత ఉందన్నారు ఘనీ. అయితే, ఇలా అధికారంలోకి వచ్చిన పాలకులకు చట్టబద్దత దక్కిన దఖలాలు చరిత్రలో ఎక్కడా లేవన్నారు. కాగా, ఆఫ్ఘన్‌ వీడిన అష్రఫ్‌ ఘనీ… తజికిస్థాన్‌కు వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. మరోవైపు ఆఫ్ఘనిస్థాన్‌ తాత్కాలిక అధిపతిగా అలీ అహ్మద్‌ జలాలీని నియమించింది తాలిబాన్‌.

ఇదిలా ఉంటే… ఆఫ్ఘనిస్థాన్‌లోని విదేశీయులకు ఎలాంటి హాని తలపెట్టబోమని తాలిబన్లు ప్రకటించారు. విదేశీయులు భయపడాల్సిన అవసరం లేదని, అయితే ఆఫ్ఘన్‌లో ఉన్న విదేశీయులు రిజిస్టర్‌ చేసుకోవాలని సూచించారు. వాళ్లు ఎప్పుడైనా స్వదేశానికి వెళ్లొచ్చని తెలిపారు. కాగా, ఆఫ్ఘనిస్థాన్‌లో దాదాపు 1500 మంది భారత పౌరులు ఉన్నారు. తిరిగి రావల్సిందిగా ఇప్పటికే అడ్వైజరీ జారీ చేసింది మన విదేశాంగ శాఖ.

Exit mobile version