Site icon NTV Telugu

తాలిబ‌న్ల‌తో సంధికి ఆఫ్ఘ‌న్ ప్రభుత్వం కీలక ప్ర‌తిపాద‌న‌లు…

తాలిబ‌న్లకు, ఆఫ్ఘ‌న్ సైన్యానికి మ‌ధ్య గ‌త కొన్ని రోజులుగా భీక‌ర పోరు జరుగుతున్న‌ది.  నాటో ద‌ళాలు, అమెరికా సైన్యం ఆఫ్ఘ‌న్ నుంచి త‌ప్పుకోవ‌డంతో తాలిబ‌న్‌లు రెచ్చిపోతున్నారు.  ఇప్ప‌టికే ఆ దేశంలోని కీల‌క‌మైన ప్రాంతాల‌ను సొంతం చేసుకున్నారు.  కాంద‌హార్‌తో పాటు, మూడో అతిపెద్ద కీల‌క న‌గ‌ర‌మైన హెరాత్‌ను కూడా తాలిబ‌న్లు త‌మ ఆదీనంలోకి తీసుకున్నారు.  మ‌రికొన్ని రోజుల్లో రాజ‌ధాని కాబుల్‌ను తాలిబ‌న్లు స్వాదీనం చేసుకున్నా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు.  దీంతో ఆఫ్ఘ‌న్ ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌తిపాద‌న‌ను తాలిబ‌న్ నేత‌ల ముందుకు తీసుకొచ్చింది.  తాలిబ‌న్ల‌తో క‌లిసి అధికారం పంచుకోవ‌డానికి సిద్ధంగా ఉన్న‌ట్టు ప్రక‌టించింది.  ఈ ప్ర‌తిపాద‌న‌ల‌ను మ‌ధ్య‌వ‌ర్తిత్వం వ‌హిస్తున్న ఖ‌త‌ర్ ముందు ఉంచింది ఆఫ్ఘ‌న్ ప్ర‌భుత్వం.  మ‌రి తాలిబ‌న్లు దీనికి ఒప్పుకుంటారా లేదా చూడాలి.  

Read: రెండో టెస్ట్ లో పట్టు బిగించిన భారత్

Exit mobile version