Site icon NTV Telugu

ఉగ్ర‌వాద స్థావ‌రాల‌పై వైమానిక దాడి…250 మంది మృతి

గ‌త కొంత కాలంగా తాలిబ‌న్ ఉగ్ర‌వాదుల‌కు, ఆఫ్ఘ‌న్ ప్ర‌భుత్వ ద‌ళాల‌ల‌కు మ‌ధ్య పోరు జ‌రుగుతున్న‌ది.  ఇప్ప‌టికే తాలిబ‌న్ ఉగ్ర‌వాదులు కీల‌క ప్రాంతాల‌ను త‌మ ఆదీనంలోకి తీసుకోవ‌డంతో ఆయా ప్రాంతాల్లోని అమాయ‌క ప్ర‌జ‌లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  ముఖ్యంగా చిన్న‌పిల్ల‌లు, మ‌హిళ‌లు ఇబ్బందులు ప‌డుతున్నారు.  ఇక ఇదిలా ఉంటే కంధ‌ర్ ప్రావిన్స్‌లోని జెరాయ్ జిల్లాలో ఆఫ్ఘ‌న్ ర‌క్ష‌ణ ద‌ళాలు ఉగ్ర‌వాదుల స్థావ‌రాల‌పై వైమానిక దాడులు చేశాయి.  

Read: భారత్ కు మరో ఒలంపిక్ మెడల్…

ఈ వైమానిక దాడుల్లో దాదాపుగా 250 మందికి పైగా తీవ్ర‌వాదులు మ‌ర‌ణించార‌ని, 100 మందికి పైగా గాయ‌ప‌డ్డార‌ని ప్ర‌భుత్వం తెలియ‌జేసింది.  తాలిబ‌న్లు గ‌త కొంత‌కాలంగా త‌మ నియంత్ర‌ణ‌లోకి తెచ్చుకున్న గ్రామీణ భూభాగాల‌ను ప్ర‌భుత్వ ద‌ళాలు స్వాధీనం చేసుకుంటున్నాయి. తాలిబ‌న్‌ల‌ను పూర్తిగా అణిచివేసేందుకు ఆఫ్ఘ‌న్ ప్ర‌భుత్వం త‌న‌దైన శైలిలో విరుచుకుప‌డేందుకు సిద్ధం అవుతున్న‌ది.  అమెరిక‌న్‌, నాటో బ‌ల‌గాలు ఆఫ్ఘ‌న్ నుంచి త‌ప్పుకున్నాక ఆ దేశంలో మ‌రోసారి తాలిబ‌న్లు రెచ్చిపోతున్నారు.  

Exit mobile version