Site icon NTV Telugu

తాలిబ‌న్ల విన్న‌పం: మ‌మ్మ‌ల్ని గుర్తించండి ప్లీజ్‌…

ఆఫ్ఘ‌నిస్తాన్‌లో తాలిబ‌న్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ప్ర‌పంచ దేశాలు ఆ దేశంపై నిషేధం విధించాయి.  ఏ దేశం కూడా ఇప్ప‌టి వ‌ర‌కు తాలిబ‌న్ ప్ర‌భుత్వాన్ని అధికారికంగా గుర్తించలేదు.  దీంతో ఆ దేశానికి చెందిన విదేశీ నిధులు స్తంభించిపోయాయి.  దీంతో దేశంలో తీవ్ర‌మైన ఆర్థిక సంక్షోభం ఏర్ప‌డింది.  ఉద్యోగాలు కోల్పోయాలు.  ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు జీతాలు చెల్లించ‌లేని ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి.  దీంతో ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నారు.  దేశంలో శాంతి భ‌ద్ర‌త‌ల‌ను పున‌రుద్ద‌రించామ‌ని, ఇప్ప‌టికైనా దేశాలు త‌మ ప్ర‌భుత్వాన్ని గుర్తించాల‌ని ఆ దేశ ప్ర‌ధాని విజ్ఞ‌ప్తిచేస్తున్నారు.  

Read: స‌ముద్ర తీరంలో రాత్రికి రాత్రే శిల్పాల్లా మారిపోయిన ఇసుక‌… ఎలాగంటే…

ప్ర‌పంచ దేశాలు మొత్తం కాక‌పోయినా క‌నీసం ముస్లిం దేశాలైనా తాలిబ‌న్ ప్ర‌భుత్వాన్ని గుర్తించాల‌ని, త‌మ కోసం కాక‌పోయినా క‌నీసం దేశంలోని ప్ర‌జ‌ల కోస‌మైనా ప్ర‌భుత్వాన్ని గుర్తించాల‌ని కోరారు.  గ‌తేడాది సెప్టెంబ‌ర్ 1 నుంచి అక్క‌డ తాలిబ‌న్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చింది.  తాలిబ‌న్లు ప్ర‌జాస్వామ్యంగా ఎంపికైన ప్ర‌భుత్వాన్ని కూల్చివేసి తాలిబ‌న్లు ఆ దేశాన్ని ఆక్ర‌మించుకున్నారు.  దీంతో అక్క‌డ ప‌రిస్థితులు దారుణంగా మారిపోయాయి.  ఆహ‌రం లేక చిన్నారులు అల్లాడిపోతున్నారు.  చిన్నారుల ఆక‌లి తీర్చేందుకు త‌ల్లిదండ్రులు బ్లాక్ మార్కెట్లో క‌డ్నీలు అమ్ముకుంటున్నారు.  

Exit mobile version