NTV Telugu Site icon

UK: ప్రెగ్నెంట్ అని తెలియకుండానే బిడ్డకు జన్మనిచ్చిన స్టూడెంట్

Student Give Birth To A Child

Student Give Birth To A Child

యూకేలో విచిత్ర ఘటన జరిగింది. ఓ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థిని రాత్రి కడుపునొప్పితో బాధపడుతూ.. బాత్రూంకు వెళితే, తెలియకుండానే బిడ్డకు జన్మనిచ్చింది. 20 ఏళ్ల జెస్ డేవిస్ అనే విద్యార్థిని సౌతాంప్టన్ యూనివర్సిటీలో పొలిటికల్ స్టడీస్ విద్యను అభ్యసిస్తోంది. అయితే తనకు పీరియడ్స్ సక్రమంగా రాకపోవడంతో దానికి సంబంధించిన నొప్పే అనుకుని బాత్రూంకు వెళ్లింది. ఆ సమయంలోనే బిడ్డకు జన్మనిచ్చింది.

అయితే ఆమె ప్రెగ్నెంట్ అయినట్లు ఎలాంటి లక్షణాలు కనిపించ లేదని..బేబీ బంప్ కూడా రాలేదని ఆమె వెల్లడించింది. తనకు పిరియడ్స్ రెగ్యులర్ గానే ఉండేవని.. అయితే కొంత కాలంగా పీరియడ్స్ రాకపోవడాన్ని పెద్దగా గమనించలేదని జెస్ డేవిస్ చెప్పారు. ఇప్పుడిప్పుడే డేవిస్ మాతృత్వానికి అలవాటుపడుతోంది. తను పుట్టినప్పుడు షాక్ కు గురయ్యానని, అంతా కల అని అనుకున్నానని.. అయితే పిల్లాడి ఏడుపు విని షాక్ కు గురయ్యానని అంది. ప్రస్తుతం పిల్లాడు దాదాపు 3 కిలోల బరువు ఉన్నాడు.

ముందుగా తీవ్రమైన నొప్పి వచ్చినప్పుడు తనకు పీరియడ్స్ ప్రారంభం అయ్యాయని భావించానని.. ఆ సమయంలో బాత్రూంకు వెళ్లాలని అనిపించిందని జెస్ డేవిస్ చెప్పుకొచ్చారు. అయితే ఇంట్లో ఒంటరిగా ఉన్న జెస్, తన బెస్ట్ ఫ్రెండ్ లివ్ కింగ్ కు ఫోన్ చేసి విషయాన్ని చెబితే ముందుగా నమ్మలేదని..అప్పుడే పుట్టిన కొడుకు ఫోటోను పంపిన తర్వాత నమ్మిందని జెస్ చెప్పారు.  35 వారాల వ్యవధిలో శిశువు జన్మించాడని.. ప్రస్తుతం తల్లి బిడ్డ కోలుకుంటున్నారని వైద్యులు వెల్లడించారు.

 

 

 

Show comments