కరోనా ముప్పునుంచి ప్రపంచం ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. క్రమంగా సాధారణ జీవనం ప్రారంభం అవుతున్నది. చాలా మందికి కరోనా పాజిటీవ్ వచ్చినప్పటికీ, లక్షణాలు కనిపించకపోవడంతో వారిలో కరోనా ఎంతకాలం ఉంటుంది అనే దానిపై అమెరికాకు చెందిన ఫెయిర్ హెల్త్ ఇన్స్యూరెన్స్ కంపెనీ ఓ పరిశోధన నిర్వహించింది. గతేడాది ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు నమోదైన వారి వివరాలను సేకరించి పరిశోధనలు నిర్వహించింది. ఈ పరిశోధనలో అనేక విషయాలు వెలుగుచూశాయి. కరోనా పాజిటీవ్‌గా నిర్ధారణ జరిగి, లక్షణాలు కనిపించని వారిలో 19 శాతం మందిలో కరోనా దీర్ఘకాలంగా ఉన్నట్టు గుర్తించారు. నాలుగు వారాల కంటే ఎక్కువకాలం కరోనా వైరస్ శరీరంలో ఉంటే దానిని దీర్ఘకాల కరోనాగా గుర్తించినట్లు పరిశోధకులు చెబుతున్నారు. ప్రారంభంలో వైరస్‌ను గుర్తించినప్పటికీ ఆసుపత్రుల్లో చేరకపోవడం వలనే ఎక్కువగా మరణాలు సంభవించినట్టు పరిశోధకులు పేర్కొన్నారు.
లక్షణాలు కనిపించని రోగుల్లో కరోనా ఎంతకాలం ఉంటుంది?
