NTV Telugu Site icon

UK Bald Head Employee: బట్టతల ఉందని తీసేశారు.. ఉద్యోగి ప్రతీకారం తీర్చుకున్నాడు

Bald Man Fired By Boss

Bald Man Fired By Boss

A 61 Year Old UK Man Fired By His Boss For Being Bald Wins 70 Lakh Payout: బట్టతల.. మగవారికి అతిపెద్ద సమస్య. క్రమంగా వెంట్రుకలు రాలుతుంటే.. ఏదో కోల్పోతున్న భావన మగవారిలో ఉంటుంది. ఒకవేళ త్వరగా బట్టతల వస్తే.. అమ్మాయిలు ఎక్కడ రిజెక్ట్ చేస్తారన్న భయం మగవారిని వెంటాడుతుంటుంది. ఇప్పుడది కెరీర్‌పై కూడా ప్రభావం చూపుతుందని తాజా ఉదంతం చాటిచెప్పింది. బట్టతల ఉందన్న కారణంతో, ఓ ఉద్యోగిని సంస్థ తొలగించింది. అయితే.. ఆ ఉద్యోగి కూడా తనకు జరిగిన అన్యాయంపై చూస్తూ ఊరికే ఉండలేదు. సదరు కంపెనీపై ప్రతీకారం తీర్చుకున్నాడు. కోర్టు మెట్లెక్కి.. భారీగా నష్టపరిహారం అందుకున్నాడు. ఆ వివరాల్లోకి వెళ్తే..

Marriage Gift: పెళ్లికి వచ్చినవారికి వెరైటీ గిఫ్ట్ … అదేంటో తెలుసా?

ఇంగ్లండ్‌కు చెందిన 61 ఏళ్ల మార్క్‌ జోన్స్ అనే వ్యక్తి లీడ్స్‌లోని టాంగో నెట్‌వర్క్‌ అనే మొబైల్‌ ఫోన్ల సంస్థలో సేల్స్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. అయితే.. అతనికి బట్టతల ఉంది. దీంతో.. బాస్ ఫిలిప్ హెస్కెట్ అతడ్ని ఉద్యోగంలో నుంచి తొలగించాడు. నిజానికి.. మార్క్ జోన్స్ చేస్తున్న ఉద్యోగానికి, అతనికి ఉన్న బట్టతలకి ఎలాంటి సంబంధం లేదు. అయినా మార్క్‌ని అతని బాస్ జాబ్ నుంచి తీసేశాడు. దీంతో ఖంగుతిన్న మార్క్.. అసలు తన బట్టతల ఏం చేసిందని ఉద్యోగంలో నుంచి తొలగించావంటూ బాస్‌ని ప్రశ్నించాడు. అందుకు ఫిలిప్ బదులిస్తూ.. సేల్స్‌ టీమ్‌లో యువకులు, చురుకైన వ్యక్తులే కావాలన్నాడు. 50 ఏళ్లు దాటి, బట్టతల ఉన్న ఉద్యోగులు తన టీమ్‌లో ఉండకూదని నిర్ణయించుకున్నానని తెలిపాడు. దీంతో మార్క్ జోన్స్‌కి మండిపోయింది. తనకు అన్యాయంతో పాటు ఘోర అవమానం జరిగిందని భావించిన మార్క్.. ఆ కంపెనీపై కోర్టులో పిటిషన్ వేశాడు.

Muralidhar Rao: బీబీసీ దుష్ప్రచారం చేసింది.. ఎటాక్ చేయకుండా ఎలా ఉంటాం?

తన బట్టతలను సాకుగా చూపించి, ఉద్యోగంలో నుంచి తనని అన్యాయంగా తొలగించారని.. ఇందుకు నష్ట పరిహారం ఇప్పించాలని మార్క్ జోన్స్ కోర్టుని కోరాడు. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు.. జోన్స్‌కి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఆ సంస్థ సరైన కారణం లేకుండా, వివక్ష చూపిస్తూ జోన్‌ని ఉద్యోగంలో నుంచి తొలగించిందని తీర్పు ఇచ్చింది. ఇందుకు గాను జోన్స్‌కు 71వేల పౌండ్లు (దాదాపు రూ.71లక్షలు) నష్టపరిహారం ఇవ్వాలని ఆదేశించింది. దీంతో.. చేసేదేమీ లేక ఆ కంపెనీ కోర్టు ఆదేశాల మేరకు జోన్స్‌కి నష్టపరిహారం ఇచ్చింది. ఇక్కడ మరో విడ్డూరమైన విషయం ఏమిటంటే.. జోన్స్‌ను ఉద్యోగం నుంచి తీసివేసిన బాస్ ఫిలిప్‌కు కూడా ‘బట్టతల’ ఉంది.