UK Bald Head Employee: బట్టతల ఉందని తీసేశారు.. ఉద్యోగి ప్రతీకారం తీర్చుకున్నాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
A 61 Year Old UK Man Fired By His Boss For Being Bald Wins 70 Lakh Payout: బట్టతల.. మగవారికి అతిపెద్ద సమస్య. క్రమంగా వెంట్రుకలు రాలుతుంటే.. ఏదో కోల్పోతున్న భావన మగవారిలో ఉంటుంది. ఒకవేళ త్వరగా బట్టతల వస్తే.. అమ్మాయిలు ఎక్కడ రిజెక్ట్ చేస్తారన్న భయం మగవారిని వెంటాడుతుంటుంది. ఇప్పుడది కెరీర్‌పై కూడా ప్రభావం చూపుతుందని తాజా ఉదంతం చాటిచెప్పింది. బట్టతల ఉందన్న కారణంతో, ఓ ఉద్యోగిని సంస్థ తొలగించింది. అయితే.. ఆ ఉద్యోగి కూడా తనకు జరిగిన అన్యాయంపై చూస్తూ ఊరికే ఉండలేదు. సదరు కంపెనీపై ప్రతీకారం తీర్చుకున్నాడు. కోర్టు మెట్లెక్కి.. భారీగా నష్టపరిహారం అందుకున్నాడు. ఆ వివరాల్లోకి వెళ్తే..
Marriage Gift: పెళ్లికి వచ్చినవారికి వెరైటీ గిఫ్ట్ … అదేంటో తెలుసా?
Also Read
- Pakistan Afghanistan Conflict: పాకిస్థాన్-ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో మళ్లీ తుపాకుల మోత.. మరోసారి భీకర కాల్పులు
- Explainer: విధ్వంసం..వినాశనం..విషాదం.. వైభవం విలయం!
- Traffic Jam: ప్రపంచంలోనే భారీ ట్రాఫిక్ జామ్.. 97 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు.. 12 రోజుల పాటు కదలని ట్రాఫిక్
- US-China Talks: అమెరికా-చైనా ద్వైపాక్షిక చర్చలు పూర్తి.. వైట్‌హౌస్ డిన్నర్లో ట్రంప్-జిన్‌పింగ్
ఇంగ్లండ్‌కు చెందిన 61 ఏళ్ల మార్క్ జోన్స్ అనే వ్యక్తి లీడ్స్‌లోని టాంగో నెట్‌వర్క్ అనే మొబైల్ ఫోన్ల సంస్థలో సేల్స్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. అయితే.. అతనికి బట్టతల ఉంది. దీంతో.. బాస్ ఫిలిప్ హెస్కెట్ అతడ్ని ఉద్యోగంలో నుంచి తొలగించాడు. నిజానికి.. మార్క్ జోన్స్ చేస్తున్న ఉద్యోగానికి, అతనికి ఉన్న బట్టతలకి ఎలాంటి సంబంధం లేదు. అయినా మార్క్‌ని అతని బాస్ జాబ్ నుంచి తీసేశాడు. దీంతో ఖంగుతిన్న మార్క్.. అసలు తన బట్టతల ఏం చేసిందని ఉద్యోగంలో నుంచి తొలగించావంటూ బాస్‌ని ప్రశ్నించాడు. అందుకు ఫిలిప్ బదులిస్తూ.. సేల్స్ టీమ్‌లో యువకులు, చురుకైన వ్యక్తులే కావాలన్నాడు. 50 ఏళ్లు దాటి, బట్టతల ఉన్న ఉద్యోగులు తన టీమ్‌లో ఉండకూదని నిర్ణయించుకున్నానని తెలిపాడు. దీంతో మార్క్ జోన్స్‌కి మండిపోయింది. తనకు అన్యాయంతో పాటు ఘోర అవమానం జరిగిందని భావించిన మార్క్.. ఆ కంపెనీపై కోర్టులో పిటిషన్ వేశాడు.
Muralidhar Rao: బీబీసీ దుష్ప్రచారం చేసింది.. ఎటాక్ చేయకుండా ఎలా ఉంటాం?
తన బట్టతలను సాకుగా చూపించి, ఉద్యోగంలో నుంచి తనని అన్యాయంగా తొలగించారని.. ఇందుకు నష్ట పరిహారం ఇప్పించాలని మార్క్ జోన్స్ కోర్టుని కోరాడు. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు.. జోన్స్‌కి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఆ సంస్థ సరైన కారణం లేకుండా, వివక్ష చూపిస్తూ జోన్‌ని ఉద్యోగంలో నుంచి తొలగించిందని తీర్పు ఇచ్చింది. ఇందుకు గాను జోన్స్‌కు 71వేల పౌండ్లు (దాదాపు రూ.71లక్షలు) నష్టపరిహారం ఇవ్వాలని ఆదేశించింది. దీంతో.. చేసేదేమీ లేక ఆ కంపెనీ కోర్టు ఆదేశాల మేరకు జోన్స్‌కి నష్టపరిహారం ఇచ్చింది. ఇక్కడ మరో విడ్డూరమైన విషయం ఏమిటంటే.. జోన్స్‌ను ఉద్యోగం నుంచి తీసివేసిన బాస్ ఫిలిప్‌కు కూడా ‘బట్టతల’ ఉంది.
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
Balapur Ganesh: బాలాపూర్ గణేష్ లడ్డు వేలంపాట అప్డేట్..
-
India vs Japan: చివరి ఓవర్ థ్రిల్లర్.. జపాన్ను భారత్ ‘చీటింగ్’ చేసిందా?
-
Fauzi : ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే అప్డేట్.. ‘ఫౌజీ’ టీజర్ వస్తోంది
-
CM Chandrababu Foreign Trip: ఫ్యామిలీతో సీఎం చంద్రబాబు విదేశీ టూర్.. 3 రోజుల వ్యక్తిగత పర్యటన..
-
Rs50,000 FD for Third Child: కొత్త పథకం.. మూడో సంతానం పుడితే భారీ ప్రోత్సాహం.. రూ.50 వేల ఫిక్స్డ్ డిపాజిట్
-
PM Kisan: రైతులకు బిగ్ అలర్ట్.. మీ అకౌంట్లోకి రూ.2,000 రావాలంటే ఈ పని తప్పనిసరి..!
ట్రెండింగ్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!