NTV Telugu Site icon

Pakistan Suicide Bomber: పాకిస్తాన్‌లో ఆత్మాహుతి దాడి.. 9 మంది పోలీసులు మృతి

9 policemen killed in Balochistan blast after suicide bomber hits truck from behind: సోమవారం పాకిస్తాన్‌లోని బలోచిస్తాన్ ప్రావిన్స్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో తొమ్మిది మంది పోలీసు అధికారులు మృతిచెందగా.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఓ సూసైడ్ బాంబర్ మోటార్ సైకిల్‌తో పోలీసు ట్రక్కును వెనుక నుండి ఢీకొట్టినట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటన బలోచిస్తాన్ ప్రావిన్స్ రాజధాని క్వెట్టాకు తూర్పున 160 కి.మీ.ల దూరంలో సిబి, కచ్చి బార్డర్ వద్ద కాంబ్రీ బ్రిడ్జ్ ప్రాంతంలో చోటు చేసుకుంది. బలోచిస్తాన్ రక్షకదళం తమ విధులు నిర్వర్తించుకొని తిరిగి పయనమవుతున్నప్పుడు.. ఈ ఘటన సంభవించింది. ఈ సంఘటన జరిగిన వెంటనే.. సంఘటనా స్థలానికి బాంబ్ స్క్వాడ్, భద్రతా సిబ్బంది హుటాహుటినా చేరుకొని సహాయక చర్యలు చేపట్టింది. బలూచిస్తాన్ రక్షకదళం అనేది ఒక ప్రత్యేక విభాగం. ఇది సున్నితమైన ప్రదేశాలలో, ముఖ్యమైన కార్యక్రమాల సమయంలో భద్రతను అందిస్తుంది.

Poonam Kaur: నా మతం చూపించి తెలంగాణ నుంచి నన్ను వెలి వేస్తున్నారు.. కంటతడి పెట్టిన పూనమ్

ప్రాథమిక విచారణలో భాగంగా.. సూసైడ్ బాంబర్ వల్లే ఈ ఘటన జరిగిందని, అయితే ఈ కేసుపై ఇంకా విచారణ జరుగుతోందని అధికారులు పేర్కొన్నారు. ఓ సూసైడ్ బాంబర్ మోటార్ బైక్ నడుపుతూ.. ఈ రక్షకదళం వాహనాన్ని వెనుక వైపు నుంచి ఢీకొట్టాడని అబ్దుల్ అమీర్ అనే ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఈ పేలుడు సంభవించగా.. బ్లూ & వైట్ రంగులో ఉన్న పోలీసుల వాహనం పల్టీలు కొట్టి.. ఉల్టా పడింది. లోపలున్న 9 మంది పోలీసు అధికారులు మరణించడంతో.. ఆ వాహనం నుంచి రక్తం ఏరులైపారింది. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈమధ్య పోలీసులపై వరుసగా జరుగుతున్న ఆత్మాహుతి దాడుల్లో.. ఇది తాజా ఎటాక్ అని అధికారులు వెల్లడించారు. బలూచిస్తాన్ ముఖ్యమంత్రి మీర్ అబ్దుల్ బిజెంజో ఈ దాడిని ఖండించారు. మరణించిన పోలీసు అధికారుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. కాగా.. బలోచిస్తాన్‌లో పుష్కలంగా లభించే గ్యాస్, ఖనిజ వనరుల్ని ప్రభుత్వం దోపిడీ చేస్తోందని బలూచి జాతి గెరిల్లాలు దశాబ్దాలుగా పోరాడుతున్నారు. ఇందులో భాగంగానే ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది.

Extramarital Affair: వివాహిత ప్రాణాల్ని బలిగొన్న వివాహేతర సంబంధం

Show comments