Site icon NTV Telugu

Saudi Arabia: సౌదీలో ఘోర ప్రమాదం.. తెలంగాణ వాసి సహా 15 మంది మృతి

Saudiarabia

Saudiarabia

సౌదీ అరేబియాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మొత్తం 15 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో తెలంగాణకు చెందిన కార్మికుడి సహా తొమ్మిది మంది భారతీయులు ఉన్నారు. దక్షిణ ఓడరేవు నగరమైన జిజాన్‌లోని పని చేస్తు్న్న ప్రదేశానికి బస్సులో వెళ్తుండగా ట్రైలర్‌ను ఢీకొట్టింది. బస్సులో 26 మంది కార్మికులు ఉండగా.. అందులో 15 మంది చనిపోయారు. తొమ్మిది భారతీయులతో సహా నేపాల్‌కు చెందిన ముగ్గురు, ఘనాకు చెందిన ముగ్గురు చనిపోయారు. ఇక తెలంగాణకు చెందిన మరో ఇద్దరు కార్మికుల సహా 11 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

ఇది కూడా చదవండి: Nara Lokesh: 8వ తరగతి విద్యార్థులు ఏడో తరగతి పుస్తకాలు చదవడం లేదు.. దీనికి గత ప్రభుత్వమే కారణం..

తొమ్మిది మంది భారతీయ పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు జెడ్డాలోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. మృతుల కుటుంబ సభ్యులతో పాటు భారత్‌లోని అధికారులతో నిరంతరం మాట్లాడుతున్నామని.. వారికి పూర్తి సహకారం అందిస్తున్నట్లు తెలిపింది. మృతులు ఏయే ప్రాంతాలకు చెందినవారనే వివరాలు మాత్రం తెలియలేదు. ప్రమాదంలో చనిపోయిన మృతుడు.. తెలంగాణలోని జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలానికి చెందిన 32 ఏళ్ల కపెలి రమేష్‌గా గుర్తించారు. ఇక గాయపడ్డ ఇద్దరు తెలంగాణ వాసులు వివరాలు మాత్రం ఇంకా అందలేదు.

Exit mobile version