Site icon NTV Telugu

Imran Khan: నన్ను చంపాలని చూస్తున్నారన్న ఇమ్రాన్.. 8 రోజులు రిమాండ్ విధించిన కోర్టు..

Imran Khan

Imran Khan

Imran Khan: అల్ ఖదీర్ ట్రస్ట్ అవినీతి కేసులో పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను నిన్న పాకిస్తాన్ పారామిలిటరీ రేంజర్లు అరెస్ట్ చేశారు. ఇస్లామాబాద్ కోర్టు ఆవరణలోనే ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే ఈ కేసులో 8 రోజుల రిమాండ్ విధించింది ‘నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో’(ఎన్ఏబీ) కోర్టు. 10 రోజుల రిమాండ్ కోరినప్పటికీ కోర్టు మాత్రం 8 రోజులకు మాత్రమే అనుమతించింది. ఇదిలా ఉంటే తనకు ప్రాణాహాని ఉందని ఇమ్రాన్ ఖాన్ కోర్టుకు వెల్లడించారు. తన హత్యకు కుట్ర పన్నారని, నెమ్మదిగా మరణించేందుకు తనకు ఇంజెక్షన్స్ ఇస్తున్నారని, 24 గంటల వరకు బాత్రూం వాడుకోనివ్వలేదని ఆయన ఆరోపించారు.

Read Also: Uttar Pradesh: బీజేపీ లీడర్ భర్తను చితకబాదిన సమాజ్‌వాదీ ఎమ్మెల్యే.. వీడియో వైరల్..

ఇస్లామాబాద్ కోర్టు ఈ నెల 17న తదుపరి విచారణ చేపట్టనుంది. ఇదిలా ఉంటే ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ తర్వాత పాకిస్తాన్ వ్యాప్తంగా అన్ని నగరాల్లో, పట్టణాల్లో నిరసనలు మిన్నంటాయి. ఆర్మీ కంటొన్మెంట్లు టార్గెట్ గా ఇమ్రాన్ ఖాన్ పార్టీ అయిన పీటీఐ కార్యకర్తలు దాడులు చేశారు. ఇమ్రాన్ ఖాన్ పై పాకిస్తాన్ అంతటా 120కి పైగా కేసులు నమోదు అయ్యాయి. వీటిలో దైవదూషణ, అవినీతి, ఉగ్రవాదానికి సంబంధించిన కేసులు ఉన్నాయి. దీంతో పాటు అత్యంత కీలకమైన ‘తోషఖానా’ కేసును కూడా ఇమ్రాన్ ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉంటే తాను ప్రభుత్వానికి, సైన్యానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకే తనను అంతమొందించాలని చూస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు.

Exit mobile version