రష్యాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. బెలారస్ దేశానికి చెందిన కార్గో విమానం కూలిపోయిన ఘటనలో ఏడుగురు స్పాట్ డెడ్ అయినట్లు అధికారులు ప్రకటించారు. రష్యాలోని తూర్పు సెర్బియాలో ఎఏన్-12 విమానం ల్యాండ్ అయ్యే సమయంలో ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది.
Read Also: తాలిబన్లు మరో సంచలన నిర్ణయం: అమెరికాను దెబ్బకొట్టేందుకు…
ఈ ఘటనకు ప్రతికూల వాతావరణమే కారణమని అధికారులు భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక దళాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కాగా మృతి చెందిన ఏడుగురిలో ముగ్గురు బెలారస్‌కు చెందిన వారు కాగా… ఇద్దరు రష్యాకు చెందిన వారు, మరో ఇద్దరు ఉక్రెయిన్‌కు చెందిన వారు ఉన్నారు.
