Site icon NTV Telugu

Yemen: యెమెన్ తీరంలో మునిగిన పడవ.. 68 మంది శరణార్థులు మృతి..

Boat Sinks Off

Boat Sinks Off

Yemen: యెమెన్ తీరంలో ఆదివారం 154 మంది వలసదారులతో ప్రయాణిస్తున్న పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 68 మంది ఆఫ్రికన్ వలసదారులు మరణించారు. మరో 74 మంది గల్లంతైనట్లు ఐక్యరాజ్యసమితి వలసల సంస్థ ధ్రువీకరించింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 10 మందిని మాత్రమే రక్షించామని యెమెన్ ఆరోగ్య అధికారి అబ్దుల్ ఖాదిర్ బజమీల్ చెప్పారు. వీరిలో తొమ్మిది మంది ఇథియోపియన్ జాతీయులు కాగా, ఒకరు యెమెన్‌కి చెందిన వారు ఉన్నారు. చాలా మంది ఆచూకీ తెలియడం లేదని చెప్పారు.

Read Also: Donlad Trump: ‘‘ ఆమె పెదాలు మెషిన్‌గన్‌లా కదులుతాయి..’’ కరోలిన్ లెవిట్‌పై ట్రంప్ సె*క్సీ కామెంట్స్..

154 మంది ఇథియోపియన్ వలసదారులతో కూడిన ఓడ ఆదివారం తెల్లవారుజామున దక్షిణ యెమెన్ ప్రావిన్స్ అబ్యాన్‌లోని అడెన్ గల్ఫ్‌లో మునిగిపోయిందని యెమెన్‌లోని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్(IOM) చెప్పింది. హార్న్ ఆఫ్ ఆఫ్రికా, యెమెన్ తీరం మధ్య సముద్రమార్గంలో ప్రమాదాల గురించి పదేపదే హెచ్చరించింది. ఎక్కువ మంది ఇథియోపియా, సోమాలియా నుంచి పని కోసం సౌదీ అరేబియా, యూఏఈ వంటి గల్ఫ్ దేశాలకు చేరుకోవాలనే ఆశతో ఇలా ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణిస్తున్నారు.

వలసదారులు ప్రయాణిస్తున్న సముద్రమార్గం అత్యంత రద్దీగా ఉండే ప్రమాదకరమైన వలస మార్గాల్లో ఒకటి. 2024లో యెమెన్‌లోకి ప్రవేశించడానికి ఏకంగా 60,000 మందికి పైగా వలసదారులు తమ ప్రాణాలను పణంగా పెట్టారని IOM తెలిపింది. గత ఏడాది ఈ మార్గంలో 558 మంది మరణించారు. గత దశాబ్ధకాలంలో 2082 మంది వలసదారులు కనిపించకుండా పోయారు. వీరిలో 693 మంది మునిగిపోయినట్లు ధ్రువీకరించారు.

Exit mobile version