NTV Telugu Site icon

Chad: చాద్‌లో దారుణం.. ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో కాల్పులు..60 మంది మృతి

Chad Violence

Chad Violence

60 killed in anti-government protests in Chad: చాద్ దేశంలో ప్రభుత్వ వ్యతిరేక అల్లర్లు మిన్నంటుతున్నాయి. వీటిని అణిచివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అధ్యక్షుడు మహమత్ ఇద్రిస్ డేబీ తన అధికారాన్ని రెండేళ్ల పాటు పొడగించుకోవడాన్ని నిరసిస్తూ వేలాది మంది ప్రజలు ఆయనకు వ్యతిరేకంగా నిరసన, ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో గురువారం దేశంలోని రెండు అతిపెద్ద నగరాల్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఎగిసిపడ్డాయి. చాద్ భద్రతా దళాలు నిరసనకారులపై కాల్పులు జరపడంతో 60 మంది మరణించారు.

Read Also: Langer Houz Crime: బాత్రూమ్ లో పేలిన గీజర్… ఇద్దరు డాక్టర్లు మృతి

ఫ్రాన్స్ తో పాటు ఇతర ఆఫ్రికన్ యూనియన్ దేశాలు చాద్ ఘటనను తీవ్రంగా ఖండించాయి. ఆమ్నేస్టి ఇంటర్నేషనల్, నిరసనకారులపై ప్రభుత్వం అణిచివేతను వెంటనే నిలిపేయాలని డిమాండ్ చేసింది. చట్టవిరుద్ధంగా హత్యలు చేసి వారిని న్యాయస్థానం ముందు నిలబెట్టాని ప్రభుత్వాన్ని కోరింది. రాజధాని ఎన్ జమెనాలో 30 మంది మరణించినట్లు చాడ్ ప్రభుత్వం అధికార ప్రతినిధి అజీజ్ మహమత్ సలే తెలిపారు. అయితే నిరసన కారులు మాత్రం 40 మంది చనిపోయినట్లు పేర్కొంటున్నారు. అనేక మందికి బుల్లెట్ గాయాలు అయ్యాయని అన్నారు. చాద్ లో రెండో పెద్ద నగరం అయిన మౌండౌలో మరో 32 మంది నిరసనకారులు ప్రభుత్వ కాల్పుల్లో మరణించారు. దక్షిణ చాద్ లోని దోబా, సర్హ్ పట్టణాలకు కూడా నిరసనలు పాకాయి.

18 నెలల క్రితం తండ్రి హత్య నేపథ్యంలో ఇద్రిస్ డేబీ బాధ్యతులు తీసుకున్నారు. దాదాపుగా మూడు దశాబ్ధాలుగా ఆయన చాద్ ను పాలిస్తున్న క్రమంలో అప్పటి అధ్యక్షుడు ఇద్రిస్ డేబీ ఇట్నో ఎప్రిల్ 2021లో తిరుగుబాటుదారుల చేతిలో చనిపోయారు. ఆ తరువాత ప్రస్తుతం పాలకుడు తన పదవిని రెండేళ్లు పెంచుకోవడంతో నిరసనలు చెలరేగాయి. రాజధాని గురువారం తెల్లవారుజాము నుంచే ప్రజలు నిరసనలు చేయడం ప్రారంభించారు. దీంతో పోలీసులు వారిపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. నిరసనకారుల సంఖ్య పెరగడంతో ప్రభుత్వ దళాలతు కాల్పులు జరిపాయి. మరణించిన వారిలో చాడియన్ జర్నలిస్ట్ నార్సిస్ ఓరెడ్జే ఉన్నారు. చాద్ లో నిరసనకారులపై కాల్పులు జరపడం ఇదే తొలిసారికాదు. 2021,2022 లో జరిగిన ఘటనల్లో కూడా అక్కడి దళాలు ప్రజలపై కాల్పులు జరిపాయి.