NTV Telugu Site icon

Earthquake: తజకిస్తాన్‌లో భారీ భూకంపం..

Earthquake

Earthquake

Earthquake Hits Eastern Tajikistan: టర్కీ భూకంపం తరువాత ప్రపంచంలో వరసగా పలు దేశాల్లో భూకంపాలు సంభవిస్తున్నాయి. నిన్న ఇండియా, నేపాల్ లో భూకంపం సంభవించింది. న్యూఢిల్లీ, చెన్నై నగరాల్లో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. తాజాగా తజకిస్తాన్ లో భారీ భూకంపం వచ్చింది. గురువారం తూర్పు తజకిస్తాన్ లో 6.8 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 5.37 గంటలకు, భూ ఉపరితం నుంచి 20.5 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్ర ఉన్నట్లు తెలిపింది.

Read Also: Joe Biden: పుతిన్ పెద్ద తప్పు చేశారు..

ఆఫ్ఘనిస్తాన్, చైనా సరిహద్దుల్లోని గోర్నో-బదక్షన్ ప్రాంతంలో భూకంపం వచ్చింది. 6.8 తీవ్రతతో భూకంపం వచ్చిన 20 నిమిషాల తరువాత మరోసారి 5.0 తీవ్రతో మరో భూకంపం వచ్చింది. తక్కువ జనాభా కలిగి ఉన్న పామిర్ పర్వత ప్రాంతాల్లో భూకంపం రావడం వల్ల పెద్దగా నష్టం కలగలేదని తెలుస్తోంది.

రెండు వారాల క్రితం టర్కీలో వచ్చిన భారీ భూకంపం వల్ల ఆ దేశం తీవ్రంగా దెబ్బతింది. టర్కీతో పాటు సిరియా తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. 7.8, 7.5 తీవ్రతతో వచ్చి రెండు భూకంపాల వల్ల ఇరు దేశాల్లో కలిపి 48 వేలకు మించి మరణాలు సంభవించాయి. ఈ సంఖ్య 50 వేలను కూడా దాటుతుందని అంచానా వేస్తున్నారు. ఇప్పటికీ టర్కీలో భూప్రకంపనలు నమోదు అవుతూనే ఉన్నాయి.

Show comments