Site icon NTV Telugu

Earthquake: జపాన్‌లో భారీ భూకంపం..

Earthquake

Earthquake

Earthquake: జపాన్ దేశం మరోసారి భూకంపానికి వణికింది. జపాన్‌లోని సెంట్రల్ ఇషికావా ప్రాంతంలో శుక్రవారం 6.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని ఆ దేశ వాతావరణ శాఖ వెల్లడించింది. జపాన్ స్థానిక కాలమాన ప్రకారం మధ్యాహ్నం 2.42 గంటలకు 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు వెల్లడించారు. సునామీపై ఎలాంటి హెచ్చరికలు చేయలేదు. భూకంపం ధాటికి నగానో మరియు కనజావా మధ్య షింకన్‌సేన్ బుల్లెట్ రైళ్లను నిలిపేశారు. సుజీ సిటీలో కొండచరియలు విరిగిపడ్డాయి.

Read Also: Sharad Pawar: ఎన్సీపీ అధినేతగా శరద్ పవార్ కొనసాగాలి.. రాజీనామా తిరస్కరణ

యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం భూకంప తీవ్రత 6.2గా నమోదు అయినట్లు వెల్లడించింది. జపాన్ దేశంలో భూకంపాలు సర్వసాధారణం. జపాన్ సముద్ర తీరంలో భూకంపాలకు కేంద్రంగా ఉంది. జపాన్ పసిఫిక్ సముద్రంలోని ‘‘రింగ్ ఆఫ్ ఫైర్’’ ప్రాంతంలో ఉంది. ఇది ఆగ్నేయాసియా నుంచి పసిఫిక్ బేసిన్ అంతటా విస్తరించించి ఉంది. ఈ ప్రాంతంలో భూకంపాలు అధికం. సముద్రగర్భంలో టెక్టానిక్ ప్లేట్ల నిరంతర కదలికల వల్ల భూకంపాలు ఏర్పడుతుంటాయి. అండర్ వాటర్ అగ్నిపర్వతాల క్రియాశీలక చర్యలు కూడా భూకంపాలకు కారణం అవుతుంటాయి.

Exit mobile version