Site icon NTV Telugu

Earthquake: టర్కీ, ఈజిప్ట్, సిరియా, గ్రీస్‌లో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 6.2గా నమోదు

Earthquakebihar

Earthquakebihar

టర్కీ, ఈజిప్ట్, సిరియా, గ్రీస్ దేశాల్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 6.2గా నమోదైంది. టర్కీ, ఈజిప్ట్, సిరియా అంతటా ప్రకంపనలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి: Upcoming Electric Scooter: ఓలా, ఏథర్, సుజుకి, యమహా నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు..

గ్రీస్‌లోని 16 మైళ్ల దూరంలో 6.2 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించింది. డోడెకనీస్ దీవులను భూకంపం తాకినట్లుగా తెలుస్తోంది. యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ ప్రకారం 68 కిలోమీటర్ల (42 మైళ్లు) లోతులో ఈ భూకంపం సంభవించినట్లుగా అంచనా వేశారు. యూఏఈ కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3:17 గంటలకు నైరుతి టర్కీలో 6.2 తీవ్రతతో భూకంపం నమోదైందని యూఏఈ జాతీయ వాతావరణ కేంద్రం తెలిపింది.

ఇది కూడా చదవండి: AP Mega DSC: మెగా డీఎస్సీకి లైన్‌ క్లియర్‌

ఇక అనేక నగరాలు, పట్టణాలు భూప్రకంపనలకు గురయ్యాయి. సీసీటీవీ ఫుటేజ్‌లో ఇళ్లల్లో వస్తువులను కదిలిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం రాలేదు.

Exit mobile version