Site icon NTV Telugu

Boat Capsize: ఆఫ్రికాలో విషాదం.. పడవ బోల్తా పడి 50 మంది మృతి..

Boat Capsize

Boat Capsize

Boat Capsize: ఆఫ్రికా దేశం సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్‌లో ఘోర విషాదం చోటు చేసుకుంది. పడవ బోల్తా పడి ఏకంగా 50 మంది చనిపోయారు. దేశ రాజధాని బాంగూయ్‌లో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రజలు ఓ గ్రామంలో అంత్యక్రియలకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ఘటన తర్వాత సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ మెరుగైన నదీ రవాణా భద్రత కోసం చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చింది.

Read Also: Amit Shah: బీహార్‌ని “లాంతరు” యుగానికి తీసుకెళ్లాని ఇండి కూటమి భావిస్తోంది..

సంఘటన జరిగిన 40 నిమిషాల్లోనే తాము అప్రమత్తమయ్యామని అధికారులు చెప్పారు. రెస్క్యూ సిబ్బంది 50 మృతదేహాలను వెలికి తీసినట్లు సివిల్ ప్రొటక్షన్ డిపార్ట్మెంట్ చీఫ్ థామస్ జిమాస్సే తెలిపారు. మ్పోకో నదిలో ఇంకా సెర్చ్ ఆపరేషన్ జరుగుతున్నట్లు వెల్లడించారు. నదిలో గల్లంతైన మరికొందరి కోసం గాలింపు జరుగుతున్నట్లు తెలిపారు.

ప్రమాద సమయంలో బోటులో 300 మంది వరకు ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఓ గ్రామ పెద్ద చనిపోవడంతో బాంగూయ్‌కి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతానికి అంత్యక్రియల కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రమాదం తర్వాత రెస్క్యూ సిబ్బంది రావడానికి 40 నిమిషాలు పట్టింది. అప్పటికే అక్కడ ఉన్న లోకల్ బోట్లు, చేపలు పట్టేవారు ప్రజల్ని రక్షించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.

Exit mobile version