Site icon NTV Telugu

Zohran Mamdani: మమ్దానీ విజయం వెనుక 5 కారణాలు.. అవేవంటే..!

Zohran Mamdani6

Zohran Mamdani6

న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో ఊహించని రీతిలో తొలి సారి ముస్లిం వ్యక్తి జోహ్రాన్ మమ్దానీ (34) ఘన విజయాన్ని అందుకున్నారు. ఓ వైపు మమ్దానీకి ఎవరూ ఓట్లు వేయొద్దని అధ్యక్షుడు ట్రంప్ పిలుపునిచ్చినా.. ఏ మాత్రం ఖాతర్ చేయకుండా ఓటర్లు కసితో మమ్దానీకి గుద్దేశారు. రిపబ్లికన్ అభ్యర్థిపై మమ్దానీ భారీ విజయంతో గెలుపొందారు.

ఇది కూడా చదవండి: Rahul Gandhi: బీహార్ పోలింగ్‌కు ముందు రాహుల్‌గాంధీ షాక్.. ‘ఓట్ చోర్’’పై కీలక ప్రజెంటేషన్

అయితే మమ్దానీ విజయం వెనుక ఐదు కారణాలు ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి.

1. మధ్యతరగతి న్యూయార్క్ వాసులను ఆకట్టుకున్న మమ్దానీ ప్రసంగం. ప్రధాన ప్రత్యర్థులు నేరం, భద్రతపై పోటీ పడగా.. మమ్దానీ మాత్రం సాధారణ సందేశం ఇచ్చారు. న్యూయార్క్ వాసుల జీవన వ్యయాన్ని తగ్గిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందేశం న్యూయార్క్ వాసులను ఆకట్టుకుంది.

2. ఇక మమ్దానీ రాజకీయ ప్రసంగాలు రొటీన్‌కు భిన్నంగా ప్రత్యేకంగా ఉండటం ఆకట్టుకుంది. ధనవంతులపై పన్ను విధించడం, పిల్లల సంరక్షణ, గృహ నిర్మాణాన్ని హక్కుగా మార్చడం వంటి ప్రసంగాలు చేశారు. ఇదే మమ్దానీకి విశ్వసనీయతను పెంచింది.

3. ఇక ఎలాంటి పార్టీ ప్రముఖుల మద్దతు లేకుండానే నేరుగా ప్రజలకు దగ్గరయ్యారు. సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలతో దగ్గర సంబంధం పెట్టుకున్నారు. ఇక ఆయా టోర్నమెంట్లు జరిగే కార్యక్రమాల్లో ప్రకటనల ద్వారా దగ్గరయ్యారు.

4. ఇక బ్లాక్‌రాక్‌కు చెందిన లారీ ఫింక్, బ్లాక్‌స్టోన్‌కు చెందిన హామిల్టన్ జేమ్స్ వంటి వ్యాపార నాయకులను కలిశారు. ప్రగతిశీల సూత్రాలకు కట్టుబడి ఉన్నప్పటికీ సహకారానికి సిద్ధంగా ఉన్నట్లు హామీ ఇచ్చారు. ఇక డెవలపర్లకు ఒక స్పష్టమైన భరోసా ఇచ్చారు.

5. ఇక పాలనలో కొత్త శక్తిని తీసుకొస్తానని మమ్దానీ హామీ ఇచ్చారు. సెనేటర్ బెర్నీ సాండర్స్, ప్రతినిధి అలెగ్జాండ్రియా ఒకాసియో-కోర్టెజ్‌తో పాటు ప్రచారం చేశారు. ర్యాలీలు స్టేడియాలను నింపాయి. ఇది అత్యంత ప్రభావవంతమైన ప్రచారాల్లో ఒకటిగా డెమోక్రాటిక్ వ్యూహకర్త ఒకరు అన్నారు.

మమ్దానీ బ్యాగ్రౌండ్
మమ్దానీ.. అక్టోబర్ 18, 1991లో జన్మించారు. ఉగాండాలోని కంపాలాలో పుట్టారు. విద్యావేత్త మహమూద్ మమ్దానీ, చిత్ర నిర్మాత మీరా నాయర్ దంపతులకు జన్మించారు. మమ్దానీ ఐదేళ్ల వయసులో సౌతాఫ్రికాకు వచ్చారు. అనంతరం ఏడేళ్ల వయసులో అమెరికాకు వచ్చి స్థిరపడ్డారు. బ్రోంక్స్ హై స్కూల్ ఆఫ్ సైన్స్ నుంచి పట్టభద్రుడయ్యారు. 2014లో మైనేలోని బౌడోయిన్ కళాశాల నుంచి ఆఫ్రికానా అధ్యయనాల్లో మేజర్ డిగ్రీని పొందారు.

మమ్దానీ భార్య పేరు రమా సవాఫ్ దువాజీ. ఈమె సిరియన్-అమెరికన్ చిత్రకారిణి. దువాజీ టెక్సాస్‌లోని హ్యూస్టన్‌లో సిరియన్ తల్లిదండ్రులకు జన్మించింది. యూఎస్, దుబాయ్‌లో ఎక్కువ కాలం గడిపారు. ఖతార్‌లోని వర్జీనియా కామన్వెల్త్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ది ఆర్ట్స్‌లో చదువుకున్నారు. అనంతరంత న్యూయార్క్‌లోని స్కూల్ ఆఫ్ విజువల్ ఆర్ట్స్ నుంచి ఇలస్ట్రేషన్‌లో మాస్టర్స్ కోసం విశ్వవిద్యాలయంలోని రిచ్‌మండ్ క్యాంపస్‌కు బదిలీ అయ్యారు.

దువాజీ.. న్యూయార్క్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికైన వెంటనే 2021లో డేటింగ్ యాప్ హింజ్ ద్వారా మమ్దానీని కలిశారు. అక్టోబర్ 2024లో నిశ్చితార్థం చేసుకున్నారు. ఫిబ్రవరి 2025లో న్యూయార్క్ నగర క్లర్క్ కార్యాలయంలో వివాహం చేసుకున్నారు.

Exit mobile version