Site icon NTV Telugu

Indian Students: విదేశాల్లో భారతీయ విద్యార్థులు.. ఐదేళ్లలో 403 మంది మృతి

Untitled 4

Untitled 4

Indian Students: దూరపు కొండలు నునుపు అని మనలో చాలామంది ఉన్నత విద్య కోసం స్వదేశాన్ని వదిలి విదేశాలకు వెళ్తుంటారు.అలా విదేశాలకు వెళ్లి చదువుకుంటే అక్కడే మంచి ఉద్యోగం వస్తుంది.. జీతం బావుంటుందని విదేశాలకు వెళ్లేందుకు చాలా మంది ఆసక్తి కనబరుస్తుంటారు. అయితే విద్యాభ్యాసం కోసం విదేశాల్లో అడుగు పెట్టి విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల్లో కొందరు వివిధ కారణాల చేత మృత్యువాత పడుతున్నారు. వివరాలలోకి వెళ్తే.. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లిన భారతీయ విద్యార్ధుల్లో వందలాది మంది మరణించారు. కేవలం గత 5 ఏళ్ళలో దాదాపు 403 మంది విద్యార్థులు మృతి చెందారు. హత్యలు, ఆత్మహత్యలు, ప్రమాదాలు, అనారోగ్యం, మానసిక ఒత్తిడి ఇలా పలు కారణాలతో విద్యార్థులు మరణిస్తున్నారు.

Read also:CM Revanth Reddy: కేసీఆర్‌ ఆరోగ్యంపై సీఎం రేవంత్‌ ఆరా.. అధికారులకు ఆదేశాలు

ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం (Centre) తాజాగా వెల్లడించింది. కాగా అత్యధిక మరణాలు కెనడా (Canada)లోనే చోటుచేసుకున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్‌ ఈ విషయానికి సంబంధించిన లిఖిత పూర్వక నివేదికను రాజ్యసభ లో సమర్పించారు. అందులో 2018 నుంచి ఇప్పటి వరకూ మొత్తం 34 దేశాల్లో 403 మంది భారతీయులు వివిధ కారణాలతో మరణించినట్లు తెలిపారు. మంత్రిత్వ శాఖ సమర్పించిన డేటా ప్రకారం.. అత్యధిక మరణాలు కెనడాలో చోటు చేఉకున్నాయి. ఒక్క కెనడా లోనే 91 మంది విద్యార్థులు మృతి చెందారు. ఆ తర్వాత యూకేలో 48, రష్యాలో 40, అమెరికాలో 36, ఆస్ట్రేలియాలో 35, ఉక్రెయిన్‌లో 21, జర్మనీలో 20, సైప్రస్‌లో 14, ఇటలీ, ఫిలిప్పీన్స్‌లో 10 మంది చొప్పున విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు.

Exit mobile version