Site icon NTV Telugu

Woman Stuck In Lift: పాపం.. లిఫ్ట్‌లో ఇరుక్కొని, మూడు రోజులు నరకయాతన అనుభవించి..

Woman Stuck In Lift

Woman Stuck In Lift

Woman Stuck In Lift: ఉజ్బెకిస్థాన్‌లోని తాష్కెంట్‌లో ఒక విషాద ఘటన చోటు చేసుకుంది. ఒక మహిళ ప్రమాదవశాత్తూ లిఫ్టులో ఇరుక్కుని, ప్రాణాలు కోల్పోయింది. సహాయం కోసం మూడు రోజుల పాటు దిక్కులు పిక్కటిల్లేలా అరిచినా.. ప్రయోజనం లేకుండా పోయింది. సహాయం లేక, ఊపిరి ఆడక, ఆకలికి తట్టుకోలేక.. ఆ మహిళ చివరికి ప్రాణాలు వదిలింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఓల్గా లియోన్టీవా(32) అనే మహిళ జులై 24వ తేదీన తన పనులు ముగించుకొని, ఇంటికి బయలుదేరింది. ఈ క్రమంలోనే 9 అంతస్తుల భవంతి నుంచి కిందకు దిగేందుకు లిఫ్ట్ ఎక్కింది. లిఫ్ట్ డోర్స్ క్లోజ్ అయ్యాయి కానీ, లిఫ్ట్ మాత్రం కిందకు కదల్లేదు. అది అలాగే స్టక్ అయిపోయింది.

Tomatoes Storing : టమోటాలు ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉండాలంటే ఏం చెయ్యాలి?

దీంతో భయభ్రాంతులకు గురైన ఓల్గా.. ఆ లిఫ్ట్ నుంచి బయటకు వచ్చేందుకు ఎంతో ప్రయత్నించింది. గట్టిగట్టిగా కేకలు వేస్తూ.. సహాయం కోసం ఆర్థించింది. కానీ.. ఎవ్వరూ ఆమె ఆర్థనాదాలు వినలేకపోయారు. అసలు ఆ లిఫ్ట్ ఆగిపోయిందన్న విషయాన్ని కూడా ఎవ్వరూ గమనించలేకపోయారు. అదే సమయంలో ఫోన్ కూడా పని చేయకపోవడంతో.. ఆ మహిళ లిఫ్ట్‌లోనే ఇరుక్కుపోయింది. మరోవైపు.. ఆఫీస్‌కి వెళ్లిన ఓల్గా తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి, సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. రెండు రోజుల పాటు ఆమె కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. కానీ.. ఎక్కడా ఆమె ఆచూకీ లభ్యమవ్వలేదు. చివరికి.. ఆమె లిఫ్ట్‌లో ఇరుక్కుని చనిపోయిందని పోలీసులు గుర్తించారు.

Dating Fraud: ఆన్‌లైన్‌లో కలిసింది.. దేశం దాటింది.. మోసపోయింది

ఈ ఘటనపై ప్రాసిక్యూటర్ కార్యాలయం విచారణ ప్రారంభించింది. ఈ లిఫ్ట్‌ని చైనాలో తయారు చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ లిఫ్ట్ పనిచేయకపోవడం వల్లే ఓల్గా అందులోనే ఇరుక్కొని మృతి చెందినట్టు పోలీసులు నిర్ధారించారు. ఈ సంఘటన జరిగిన రోజు.. ఆ బిల్డింగ్‌లో ఎలాంటి కరెంట్ కోతలు లేవని రీజనల్ ఎలక్ట్రిసిటీ నెట్‌వర్క్స్ ఎంటర్‌ప్రైజ్ అవుట్‌లెట్ ధృవీకరించింది. స్థానికుల వాంగ్మూలాన్ని తీసుకొని, ఈ కేసుని పోలీసులు విచారిస్తున్నారు. సరిగ్గా ఇలాంటి ఘటనే ఇటలీలోనూ కొన్నిరోజుల క్రితం జరిగింది. కరెంట్ కట్ అయిన కారణంగా.. ఓ వ్యక్తి లిఫ్ట్‌లో ఇరుక్కొని చనిపోయాడు.

Exit mobile version