NTV Telugu Site icon

Nigeria wedding: పెళ్లిలో విషాదం.. ఆత్మాహుతి దాడిలో 32 మంది దుర్మరణం

Nogirya

Nogirya

నైజీరియాలో మహిళా ఆత్మాహుతి బాంబర్లు బీభత్సం సృష్టించారు. పెళ్లి, అంత్యక్రియలు, ఆస్పత్రిని లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడ్డారు. దీంతో 32 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈశాన్య నైజీరియా పట్టణంలోని గ్వోజాలో వారాంతంలో జరిగిన పలు ఆత్మాహుతి బాంబు దాడుల్లో మరణించిన వారి సంఖ్య 32కి చేరిందని, 42 మంది గాయపడినట్లు ఆ దేశ ఉపాధ్యక్షుడు కాశీం శెట్టిమా సోమవారం తెలిపారు. షెట్టిమా బోర్నో రాష్ట్ర రాజధాని మైదుగురిలోని ఆసుపత్రిని సందర్శించారు. కొంతమంది గాయపడినవారు చికిత్స పొందుతున్నారు. ఇక పేలుళ్లకు బాధ్యులుగా ఎవరు ప్రకటించలేదు. అయితే గ్వోజా చుట్టూ బోకో హరామ్ జిహాదిస్ట్ గ్రూప్ చురుకుగా ఉన్నట్లుగా భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Tragedy: విషాదం.. చెరువులో మునిగి తల్లితో సహా ఇద్దరు కూతుళ్లు మృతి

2009లో ఆత్మాహుతి దాడుల్లో 40,000 మందికి పైగా మరణించారు. మరో రెండు మిలియన్ల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. 2014లో సైన్యం.. మిలిటెంట్లను నిర్మూలించారు. దీంతో అరుదుగా జరుగుతున్నాయి. తాజాగా ఇటీవల మళ్లీ చోటుచేసుకుంది. అయినప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఆకస్మిక దాడులను నిర్వహిస్తున్నారు. ఈ సంఘటన చాలా దిగ్భ్రాంతికరమైనదని పాలక APC పార్టీకి చెందిన బోర్నో సెనేటర్ మహమ్మద్ అలీ న్డుమే విలేకరులతో అన్నారు.

ఇది కూడా చదవండి: Pani puri: ‘పానీ పూరి’ శాంపిళ్లలో క్యాన్సర్ ఏజెంట్స్.. ప్రభుత్వం చర్యలు..

ఒక వివాహ వేడుకలో మధ్యాహ్నం 3:00 గంటల సమయంలో ఆత్మాహుతి బాంబర్ అతిథుల మధ్య పేలుడు పదార్థాలను అమర్చినప్పుడు మొదటి దాడి జరిగిందని అధికారులు తెలిపారు. వివాహ దాడిలో బాధితుల కోసం అంత్యక్రియల ప్రార్థనలు జరుగుతుండగా మరొక మహిళా ఆత్మాహుతి బాంబర్ పేల్చిందని స్థానిక అత్యవసర సేవల అధిపతి బార్కిండో సైదు తెలిపారు. కొన్ని నిమిషాల తర్వాత నగరంలోని జనరల్ హాస్పిటల్ సమీపంలో ఒక టీనేజ్ అమ్మాయి మరొక పరికరాన్ని పేల్చివేసిందని పేర్కొన్నారు. నాల్గవ ఆత్మాహుతి దాడి సెక్యూరిటీ పోస్ట్‌ను లక్ష్యంగా చేసుకుని ఒక సైనికుడితో సహా ముగ్గురిని చంపారు.

ఇది కూడా చదవండి: Lufthansa plane: లుఫ్తాన్స్ విమాన చక్రంలో మంటలు.. ఢిల్లీలో సేఫ్‌గా ల్యాండ్