3 Year Old Child Accidentally Shoots Her Sister In America: అమెరికాలో తాజాగా ఓ దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఒక తుపాకీని ఆట వస్తువు అనుకున్న ఓ మూడేళ్ల చిన్నారి.. పొరపాటున తన అక్కవైపు గురి పెట్టి పేల్చింది. ఈ ఘటనలో నాలుగేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. టెక్సాస్‌లో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. హ్యూస్టన్ ప్రాంతంలోని టామ్‌బాల్ పార్క్‌వే సమీపంలో ఒక కుటుంబం నివసిస్తోంది. వీరిలో ఇద్దరు చిన్నారులు (ఒకరు మూడేళ్ల చిన్నారి, మరొకరు నాలుగేళ్ల అమ్మాయి) ఉన్నారు. ఆదివారం సాయంత్రం ఈ ఇద్దరు చిన్నారులు ఒక బెడ్‌రూమ్‌లో ఆడుకుంటుండగా.. ఇతర కుటుంబ సభ్యులు వేరే గదుల్లో తమతమ పనుల్లో నిమగ్నమై ఉన్నారు.
Divyabharathi: చిన్నగౌను వేసుకున్నపెద్ద పాపా.. నీ చిన్ననాటి ముద్దుపేరు లాలిపాపా
ఆ చిన్నారులు ఆడుకుంటున్న సమయంలో.. మూడేళ్ల పాపకు గదిలో ఒక ఫుల్ లోడెడ్ గన్ దొరికింది. అది ఎంత ప్రమాదకరమైందో ఆ చిన్నారికి తెలీదు. అది కూడా ఒక ఆట వస్తువే అని అనుకుంది. ఆ తుపాకీ తీసుకొని, తన అక్కవైపు గురి పెట్టి కాల్చింది. ప్రమాదవశాత్తు జరిగిన ఈ ఘటనలో ఆ చిన్నారి అక్క మృతిచెందింది. గన్ పేలిన శబ్దం విన్న పెద్దలు.. వెంటనే గదిలోకి వచ్చి చూశారు. రక్తపు మడుగులో పడివున్న ఆ చిన్నారిని.. వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే.. అప్పటికే ఆ పాప ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు ధృవీకరించారు. ఆ పాప మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అయ్యారు. మరోవైపు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Xi Jinping: సైన్యాన్ని ‘గ్రేట్ వాల్ ఆఫ్ స్టీల్’గా తీర్చిదిద్దుతాం.. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్
ఇదిలావుండగా.. ఈమధ్య కాలంలో అమెరికాలో గన్ కల్చర్ విపరీతంగా పెరిగిపోయింది. దుండగులు చేత తుపాకీ పట్టుకొని.. జనసందోహం ఉన్న ప్రాంతాల్లో కాల్పులకు తెగబడుతున్నారు. కొందరు కారణాలు లేకుండానే ఈ దాడులకు పాల్పడుతుంటే.. మరికొందరు ప్రతీకార చర్యల్లో భాగంగా కాల్పులు జరుపుతున్నారు. ఈ సంఘటనల నుంచి తమని తాము కాపాడుకోవడం కోసమే.. జనాలు లైసెన్స్‌డ్ తుపాకుల్ని తమ వద్ద పెట్టుకుంటున్నారు. ఈ గన్ కల్చర్‌ను నియంత్రించాలని అమెరికాలో పెద్దఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి.