NTV Telugu Site icon

Israel: హిజ్బుల్లా పేజర్లను ఇజ్రాయిల్ ఎలా పేల్చింది.? మూడు సిద్ధాంతాలు..

Israel

Israel

Israel: హిజ్బుల్లా మిలిటెంట్లను ఇజ్రాయిల్ చావు దెబ్బ తీసింది. ఎక్కడ మొబైల్ ఫోన్లు, శాటిలైట్ ఫోన్లు ఉపయోగిస్తే ఇజ్రాయిల్ కనిపెట్టేస్తోందనే భయంతో అవుట్ డేటెడ్ కమ్యూనికేషన్ పరికరం ‘‘పేజర్’’లను హిజ్బుల్లా మిలిటెంట్లు వాడుతున్నారు. అయితే, అవి కూడా ఇజ్రాయిల్ నుంచి తప్పించుకోలేదని మంగళ, బుధవారంలో లెబనాన్ వ్యాప్తంగా జరిగిన పేలుళ్లు సూచిస్తున్నాయి. ఉన్నపళంగా పేజర్లు పేలడంతో 37 మంది మరణించారు. 3000 మంది గాయపడ్డారు. దేశవ్యాప్తంగా 5000 కన్నా ఎక్కువ పేజర్లు టపాసుల్లా పేలాయి. ఈ దాడుల వెనక ఇజ్రాయిల్ దాని గూఢచార సంస్థ మొసాద్ ఉందని హిజ్బుల్లా ఆరోపిస్తోంది. అయితే, ఇజ్రాయిల్ మాత్రం ఈ దాడులపై ఇప్పటి వరకు స్పందించలేదు. అసలు ఇలాంటి దాడులు ఎలా సాధ్యమైందని ఇతర దేశాల గూఢచర్య సంస్థలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.

ఈ పేలుళ్లకు ప్రధానంగా 3 సిద్ధాంతాలను నిపుణులు చెబుతున్నారు.
1) లెబనీస్ భద్రతా విభాగం, రాయిటర్స్ నివేదిక ప్రకారం.. తైవాన్ ఆధారిత తయారీదారు గోల్డ్ అపోలో నుంచి హిజ్బుల్లా 5000 పేజర్లను ఆర్డర్ చేసింది. ఇజ్రాయిల్ గూఢచార సంస్థ మొసాద్ ఈ పరికరాల్లో 3 గ్రాముల కన్నా చిన్న పేలుడు పదార్థాలను అమర్చింది. పేజర్లకు ఓ కోడెడ్ మెసేజ్ పంపించడం ద్వారా ఇవి ఒక్కసారిగా పేలాయి, ఈ పేలుళ్లను రిమోట్ ద్వారా ఆపరేట్ చేసినట్లు నమ్ముతున్నారు. ఈ పేలుడు పదార్థాలను స్కానర్లు గుర్తించడం సాధ్యం కాదని నిపుణులు చెబుతున్నారు. వాకీ టాకీల్లో కూడా ఇదే చర్య ద్వారా పేల్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి. వాకీ టాకీలు జపాన్ సంస్థ తయాు చేసింది.

2) సప్లై చైన్ ‌లో ట్యాంపరింగ్ జరిగినట్లు నమ్మతున్నారు. ఈ పరికరాలు హిజ్బుల్లా సభ్యులకు చేరడానికి ముందే, వాటిని ఇజ్రాయిల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీల వారు యాక్సెస్ చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ పేజర్ల గోల్డ్ అపోలో ఏఆర్-924 మోడల్‌కి చెందినవి. అయితే తదుపరి విచారణలో గోల్డ్ అపోలో బ్రాండ్‌ను ఉపయోగించడానికి లైసెన్సింగ్ హక్కులను కలిగి ఉన్న సంస్థ హంగేరీలోని BAC కన్సల్టింగ్ ద్వారా తయారు చేయబడినట్లు వెల్లడైంది. ఇది తయారీ లేదా పంపిణీ దశల్లో విధ్వంసం జరిగే అవకాశాన్ని పెంచుతుంది, ఇది గుర్తించకుండా పేలుడు పదార్థాలను అమర్చడానికి ఇజ్రాయెల్‌కు అవకాశం కల్పిస్తుంది. లెబనాన్ రాకముందే వీటిని ట్యాంపరింగ్ చేసినట్లు అనుమానిస్తున్నారు.

3) మెసేజ్ ద్వారా రిమోట్ యాక్టివేషన్.
పేజర్స్, వాకీటాకీలను ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ లేదా రేడియో ఫ్రీక్వెన్సీ ఉపయోగించి రిమోట్‌గా పేల్చిబడ్డాయి. సైబర్‌స్పేస్ సోలారియం కమిషన్ రిటైర్డ్ అడ్మిరల్ మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మార్క్ మోంట్‌గోమెరీ, రేడియో ఫ్రీక్వెన్సీ లేదా ఎలక్ట్రానిక్ సిగ్నల్ వల్ల పేలుళ్లు సంభవించి ఉండవచ్చని సూచించారు. ఇది సైబర్ లేదా రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ ద్వారా ఎనేబుల్ చేయబడిన ఉద్దేశపూర్వకమైన ఇంటర్నల్ డిఫెక్ట్ కావచ్చని చెప్పాడు. న్యూయార్క్ టైమ్స్ కూడా కోడెడ్ మెసేజ్ ద్వారా పేలుడు సంభవించినట్లు నివేదించింది. పేజర్లు ఒకే సమయంలో హిజ్బుల్లా నాయకత్వం నుంచి అంతర్గత సమాచార మార్పిడిని అందుకున్నారు. వీటిని ఓపెన్ చేయగానే పేలుడుని ప్రేరేపించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో బాధితులు ఏదో మెసేజ్ చూస్తున్నట్లు కనిపిస్తోంది.