World Bank: ప్రపంచంలోని 26 పేద ఆర్థిక వ్యవస్థలు రోజుకు $2.15 (రూ.180) కంటే తక్కువ ఆదాయంతో జీవిస్తున్న 40 శాతం మంది ప్రజలు 18 ఏళ్ల గరిష్టానికి చేరుకున్నారని ప్రపంచ బ్యాంక్ తెలిపింది. ఆ పేద ఆర్థిక వ్యవస్థలు, వార్షిక తలసరి ఆదాయాలు $1,145 కంటే తక్కువగా ఉన్నాయని.. మార్కెట్ ఫైనాన్సింగ్ పడిపోవడంతో ఐడీఎ గ్రాంట్లు, దాదాపు జీరో వడ్డీ రేటు రుణాలపై ఎక్కువగా ఆధారపడుతున్నాయని వరల్డ్ బ్యాంక్ ప్రకటించింది. వారి సగటు రుణం-GDP నిష్పత్తి 72 శాతం ఉండగా 18 సంవత్సరాల గరిష్ట స్థాయికి పడిపోయింది. వీరు ఎక్కువ శాతం ప్రకృతి వైపరీత్యాలు, ఇతర సమస్యలకు గురవుతున్నారని నివేదికలో తెలిపింది. అలాగే, కోవిడ్-19 మహమ్మారి సందర్భంగా ఈ పేద దేశాల ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఇబ్బందుల్లో కొనసాగుతుందని చెప్పుకొచ్చింది.
Read Also: This Week OTT Movies: ఇక పండగే.. ఈ వారం ఓటీటీల్లోకి 25 సినిమాలు
అయితే, ప్రపంచ బ్యాంకు మరియు అంతర్జాతీయ ద్రవ్య నిధి వార్షిక సమావేశాలు వాషింగ్టన్‌లో జరగడానికి ఒక వారం ముందు పేదల దేశాల యొక్క ఆర్థిక స్థితిగతుల జాబితా విడుదలైంది. దీంతో మిగిలిన ప్రపంచం కరోనా నుంచి చాలా వరకు కోలుకుని దాని వృద్ధి పథాన్ని తిరిగి ప్రారంభించిందని ప్రపంచ బ్యాంకు చెప్పుకొచ్చింది. ప్రపంచంలోని అత్యంత పేదల కోసం తన ఫైనాన్సింగ్ ఫండ్‌ను తిరిగి పూరించేందుకు ఈ సంవత్సరం ప్రపంచ బ్యాంక్ $100 బిలియన్లను సమీకరించే ప్రయత్నాలు చేస్తుంది.
Read Also: Rahul Gandhi: హర్యానాలో ఓటమి తర్వాత మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ కీలక సమావేశం..
ఇక, 26 పేద దేశాల్లో మూడింట రెండొంతుల దేశాలు సాయుధ పోరాటాల్లో ఉన్నాయని వరల్డ్ బ్యాంక్ చెప్పుకొచ్చింది. అలాగే, సంస్థాగత మరియు సామాజిక దుర్బలత్వం కారణంగా తమ ఆర్థిక వ్యవస్థను క్రమబద్దీకరణ చేయడంలో విఫలమవుతున్నాయని ప్రపంచ బ్యాంకు పేర్కొనింది. ఇక్కడ విదేశీ పెట్టుబడులను నిరోధిస్తాయని వెల్లడించింది. అయితే, ఐడీఏ సాధారణంగా ప్రతి మూడు సంవత్సరాలకు ప్రపంచ బ్యాంక్ షేర్ హోల్డింగ్ దేశాల సహకారంతో నిధులను భర్తీ చేస్తుంది. ఈ సందర్భంగా గత ఐదేళ్లలో ఆర్థిక సమస్యలను 26 దేశాలు ఎదుర్కొంటున్నాయనే విషయాని వెల్లడించింది. కాగా, ఏడాది డిసెంబర్ 6వ తేదీ నాటికి $100 బిలియన్ల కంటే ఎక్కువ మొత్తంలో నిధులను సమీకరించాలని ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ అజయ్ బంగా లక్ష్యంగా పెట్టుకున్నారు.