NTV Telugu Site icon

Pakistan: పాకిస్తాన్ ఆర్మీ బేస్‌పై ఆత్మాహుతి దాడి.. 23 మంది మృతి..

Pakistan

Pakistan

Pakistan: దాయాది దేశం పాకిస్తాన్‌‌లో భారీ ఉగ్రదాడి జరిగింది. పాకిస్తాన్ ఆర్మీ బేస్ వద్ద మంగళవారం ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 23 మంది మరణించారని తెలుస్తోంది. ఈ దాడిని పాకిస్తాన్ తాలిబాన్‌కి అనుబంధంగా ఉన్న ఉగ్రవాదులు జరిపినట్లుగా అధికారులు తెలుపుతున్నారు. ఆఫ్ఘాన్ సరిహద్దుల్లో ఉన్న ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలోని సైనిక స్థావరంపై తెల్లవారుజామున ఈ దాడి జరిగింది. అయితే దాడి జరిగిన సమయంలో సైనికులతో పాటు ఇతరులు నిద్రలో ఉన్నట్లు తెలుస్తోంది. మరణించిన వారిలో చాలా మంది సివిల్ డ్రెస్సుల్లో ఉన్నారు. దీంతో మరణించిన వ్యక్తులు సైనికులా..? లేదా..? అని తెలియాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.

Read Also: Gaza : గాజాలో యుద్ధంతో ఆకలికి అలమటిస్తున్న జనాలు

ఓ పాఠశాల భవనాన్ని తాత్కాలిక సైనిక స్థావరంగా మార్చుకున్నారు. ఈ భవనం వద్దే ఆత్మాహుతి వాహనం పేలింది. మరో 27 మంది గాయపడినట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి భవనం కూలిపోయింది. మృతదేహాలను శిథిలాల కింద నుంచి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. తెహ్రీక్-ఇ-జిహాద్ పాకిస్తాన్, పాకిస్తాన్ తాలిబాన్‌తో అనుబంధంగా ఉన్న కొత్త తీవ్రవాద గ్రూపు ఈ తెల్లవారుజామున 2.30 గంటలకు దాడి చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటనపై పాకిస్తాన్ ఆర్మీ ఇంకా స్పందించలేదు.

2021లో తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్‌లో అధికారంలోకి వచ్చిన తర్వాత పాక్-ఆఫ్ఘన్ ప్రాంతంలో ఉగ్రవాద దాడులు జరిగాయి. ముఖ్యంగా ఖైబర్ ఫఖ్తుంఖ్వా, వజీరిస్తాన్, బలూచిస్తాన్ ప్రావిన్సుల్లో సైన్యం, పోలీస్ అధికారులే టార్గెట్‌‌గా ఉగ్రదాడులు పెరిగాయి. పాకిస్తాన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ కాన్‌ఫ్లిక్ట్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ ప్రకారం, గత సంవత్సరంతో పోలిస్తే 2023 మొదటి అర్ధభాగంలో దాదాపు 80 శాతం దాడులు పెరిగాయని పేర్కొంది. జనవరిలో, ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ రాజధాని పెషావర్ యొక్క వాయువ్య నగరంలో ప్రధాన కార్యాలయంలో 80 మంది పోలీసు అధికారులను చంపిన మసీదు బాంబు దాడి పాక్ తాలిబాన్ల ప్రమేయం ఉంది.